81
నది పుచ్చుపండెకాని మెచ్చుపండు కాదు. అందలి ప్రధాన స్త్రీపాత్ర చిత్రాంగి. దాని దుర్నీతి చేస్టా కలాపమంతయు ఆతళుకుఁ బెళుకులును, ఆ మాయదారి చేతలును, ఆ ఱాగతనంపు పరుసము లును, ఆ తఱితీపు పల్కుల జాణతనమును, ఆ ప్రోడతనపు జిత్తులును, ఆచిన్నెలును, ఆవన్నెలును -నాటకారంభమునుండి ప్రేక్షకుల కనుల కంటఁ గట్టి, తరువాత నెపుడో చిత్రాంగికి దుర్మరణశిక్ష విధింపఁబడినవి తెరమఱుఁగున వినిపించిన మా- త్రాన నాటక దర్శనాంతమున జనుల భావదర్పణ ములలో బ్రతిబింబితములయి నిలిచియుండు భా- వము లెట్టివో, ప్రపంచ తత్త్వవేత్తలకు విన్నవిం చుట యధిక ప్రసంగమే యగును. కథ వేఱయి యున్నచో నన్ని విధముల నగ్రతాంబూలము నకుఁ దగినదై యీనాటకము మాకవి కింకను నూరుమడుంగుల కీర్తిఁ దెచ్చియుండునని ఘంటా ఘోషము చాటఁగలను.
దుర్గుణముల వర్ణింపనిదే సుగుణములకు వన్నియరాదను వాదమును గొంతవఱకు మేము నొప్పుకొందుముగాని మందునకైనను విషము తగి సంతయె వాడవలెనని విన్నవింపవలసియున్నది. ఇక నాటకదర్శనము చేతనే చెడుదారిఁ బట్టు