80
కీమఱుగు మాటులు సరిరావు. నాయకుఁడు వేశ్య యింటికరుగు సంవిధానమును గల్పించి యొక కవి యారంగమున వీధి బొజుంగులు సానివాడకుఁ బోవునప్పటి యాచారములును వేశ్యతోడి సంభా షణచాతుర్యాదులును తూచా తప్పకుండ ననుభవ హీనుల కుపకరించులాగు వ్రాసి వారి కృతజ్ఞతకుఁ బాత్రుఁడయ్యె. మఱియొక కవిశిఖామణి తారా శశాంక విజయమునఁ బడకటింటిలోఁ దూగుమం- చముపైఁ గూర్చున్న చంద్రునకు గుఱులు దువ్వుచు నర్మోక్తుల దేలుచున్న తారాదేవికిఁ బరవశత్వమునఁ బోక ముడి వీడినట్లు పైశాచ శృంగార వర్ణనగల రంగము నొక దానిని గల్పించె ననుటకే సిగ్గగుచున్నది. ఇట్టి నాటకము లింకనుఁ గొన్ని బయలుదేఱ గలవా వేఱు దుర్నయ మేల? మన ఆంధ్రనాటక పితామహుని నాటకరత్నము లలోనెల్ల నతని విషాద సారంగధరమే సానదీఱినది. అతని రచనా ప్రాగల్భ్యమును నాటక కళా కౌశల్య మును సంవిధాన సంపాదన ప్రతిభయు రసపోషణ చాతుర్యమును నందుఁ బూర్ణముగఁ బ్రతిఫలించిన వనుట యతిశయోక్తికాదు. కాని యెంత పక్వ మయిన నేల యాకథ పుచ్చినపండు! తొడిమకడనో మఱి యేమూలనో తీసి యింత కలదన్నను గూడ