x
ఈ 'వదరుఁబోతు' వ్యాసకర్తలకన్న మునుపే అనగా 1903 వ సంవత్సరముననే ఈ కార్యము చేయుటకు ప్రారంభించినవారు సుగృహీతనామధేయులగు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహరాయ కవీశ్వరులు. వారు అడిసన్ దొరయొక్క 'స్పెక్టేటరు' పదమునే 'సాక్షి' గా భాషాంతరీకరించి ఆపేరుతో తమ యమూల్యవ్యాసములను సువర్ణలేఖ పత్రికలో తొలుదొల్త ప్రచురింప మొదలిడి కొన్నా ళ్ళ కెందులలో నిలిపివేసిరి. తరువాత 1920 యవ సంవత్సరమునుండి పుంఖానుపుంఖములుగా ఆంధ్రపత్రికయందు బయలు వెడలుచుండిన వారి 'సాక్షి'వ్యాసములను చదివి ఆనందింపని యాం ధ్రుఁడుండఁడు. కాని యీవ్యాసకర్తలు ఆ మొదటి 'సాక్షి' వ్యాసముల నేఱుఁగరు. వీరేకాదు, ఆం ధపత్రికలో వచ్చు వఱకును ఏ కొందఱికోకాని ఆంధ్రదేశమున 'సాక్షి' పేరు తెలిసి యుండలేదని స్పష్టముగాఁ జెప్పవచ్చును. కావున 1917 లో ‘వదరుఁబోతు' జననమునకు 'సాక్షి'తో నేసంబంధ మును లేడనుట నిక్కము . ఇరువురకును ఒక విధమైన యుత్సాహోద్రేకములే యుండినను నరసింహారావుగారికి, 'స్పెక్టేటరు' అను అడిసను దొరయుంచిన పేరే తామును తెలుఁగులో తమ వ్యాసముల