పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదర్శనకు నిలబెట్టే వరకు, పడేసి ఉంచారు. ఎగ్జిబిషన్ రోడ్లోని ఈ భవనంలో 1851కి చెందిన ఈస్టరన్ గాలరీస్ అనే అద్భుత ప్రదర్శనశాల ఉండేది. ఇది ఇండియా ఆఫీసు వారికి అద్దెకు ఇవ్వబడింది. తరువాతి కాలంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్‌గా పిలవబడిన ఇండియా మ్యూజియం భవనాన్ని 1950లో పడగొట్టి, స్థానంలో ఇంపీరియల్ కాలేజి భవనాన్ని నిర్మించారు.

ఇండియా మ్యూజియంను రద్దు చేసి, అందులోని వస్తువులను బ్రిటిష్ మ్యూజియంకు కొన్ని విక్టోరియా - ఆల్బర్ట్ మ్యూజియంకు కొన్నింటిని ఇచ్చే వరకు అమరావతి శిల్పాలు 1879వ సంవత్సరం వరకు ఎగ్జిబిషన్ రోడ్డులోనే ఉన్నాయి. ఇండియా మ్యూజియంలోని భారతదేశానికి చెందిన పురావస్తు, శిల్ప సంపదను బ్రిటిష్ మ్యూజియానికి, అలంకరణ కళాఖండాలను, వస్రాలు, లోహ, దారు కళా ఖండాలను విక్టోరియా - ఆల్బర్డ్ మ్యూజియానికి (వీటికి కొన్ని మినహాయింపులున్నాయి) పంపడమైంది.

ఆ కాలంలో సర్ ఆగస్టస్ ఉల్‌స్టన్ ఫ్రాంక్స్ అనే ఆయన బ్రిటిష్ మ్యూజియంలో బ్రిటిష్ మరియు మధ్య ప్రాచ్య పురావస్తు విభాగానికి కీపర్గా ఉండేవాడు. ఈయన పురావస్తు కళాఖండాల సేకరణలోను, వాటిని పరిరక్షించడంలోనూ 19వ శతాబ్దంలోనే సుప్రసిద్దుడు. ఓల్డ్ ఇండియన్ మ్యూజియం నుంచి అమరావతి శిల్పాలను ఈయన 1880లో సేకరించాడు. ఈ శిల్పాల మీద ఆయన అమితాసక్తిని కనబరిచి, వాటి వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి ఆ కాలానికి చెందిన సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్తలను సంప్రదించి, గొప్ప పరిశోధన చేశాడు. రాబర్ట్ స్వెల్‌కు సర్ వాల్టర్ ఇలియట్ వ్రాసిన లేఖలో ఈ విషయం ప్రస్థావిస్తూ, "ఫ్రాంక్స్‌కు కళా ఖండాల పట్ల గల నిరుపమానమైన ప్రేమ నన్ను ముగ్గుణ్ణి చేసింది. వాటి విలువను గ్రహించి ఆ శిల్పాల పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ మూలంగా ఈ అపురూప కళా ఖండాలు మనకు దక్కాయి. ఆయన చేతుల్లో పడటం వాటి అదృష్టం. వాటి ప్రదర్శనం కోసం తగినంత స్థలాన్ని కేటాయించవలసిందిగా నేను ఆయనను అభ్యర్థించాను." బ్రిటిష్ మ్యూజియంలోని ప్రాచీన దక్షిణ, ఆగ్నేయ