పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

వాటిని ఫొటోలు తీయించి డ్రాయింగ్లు గీయించి, నంబరింగ్ చేయించాడు. ఈ డ్రాయింగ్లు ఇప్పడు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇందుకు సంబంధించి ఏ పత్రమూ ప్రచురింపబడలేదు. ఇలియట్ మారబుల్స్ కు ఫొటోలు తీసి, ప్రభుత్వ ఫొటోగ్రాఫర్ కాస్టల్ లిమ్యాటైస్ 1858లో ప్రచురించే నాటికి వాటికి మరో ఏడు రాళ్లు చేరి, మొత్తం 111 అయినాయి.

1859 నాటికి ఇవి 121కి చేరాయి. ఆ సంవత్సరం ఎడ్వర్డ్ బల్‌ఫోర్ కోరిక మేరకు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ధనంతో వాటిని ఓడలో లండన్లోని ఇండియా ఆఫీసుకు తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఫైవ్ హౌస్, వైట్ హాల్ లోని ఇండియా మ్యూజియంలో వాటికి ఒక స్థలాన్ని చూసే వరకు, సంవత్సరం పాటు ఇవి సౌత్ పార్క్‌లోని బాల్స్ వార్స్ ప్రాంగణంలో నిరాదరణకు గురై పడి ఉన్నాయి. ఎండవానలకే కాక, వాయు కాలుష్యానికి కూడా ఇవి గురై దెబ్బ తిన్నాయి. మద్రాసులో ఫొటోలు తీసే నాటికి దాదాపు సురక్షితంగా ఉన్న ఈ రాళ్లు 1880లో బ్రిటిష్ మ్యూజియం వాటిని హస్తగతం చేసుకొనే నాటికి అక్కడి వాతావరణానికి బాగా పాడైపోయాయి.

1867వ సంవత్సరంలో పారిస్‌లో జరిగిన యూనివర్సల్ ఎగ్జిబిషన్లో కొన్ని అమరావతి శిల్పాలను భారతీయ వాస్తు శాస్త్రం మీద అధ్యయనం చేస్తున్న చరిత్రకారుడు జేమ్స్ ఫర్గూసన్ చూడటం జరిగింది. ఈ శిల్పాల ప్రాభవం గురించి తనకు కాకతాళీయంగా తెలిసిందని ఫర్గూసన్ ఒక సందర్భంలో చెప్పారు. ఆ తరువాత అమరావతి శిల్పాల ఫొటోలను తన వ్యాఖ్యానంతో ఆయన 1868లో "వృక్ష-సర్పపూజ" అన్న పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. 1873లో దీనికి రెండవ ముద్రణ వచ్చింది. ఈ మధ్యకాలం వరకు అమరావతి శిల్పాల మీద బ్రిటన్లో వచ్చిన సాధికారిక ప్రచురణ ఇదే.

ఫైవ్ హౌస్ నుంచి ఈ శిల్పాలను తరలించిన తరువాత వాటిని లాంబెల్లో బెల్ వెదర్ రోడ్ లోని "ఇండియా స్టోర్స్"లో 1874 వరకు, సౌత్ కెన్సింగ్టన్లోని న్యూ ఇండియా మ్యూజియంలో సౌత్ ఎంట్రెన్స్ లో వాటిని