పుట:రామాయణ విశేషములు.pdf/99

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 49


జతీంద్రమోహన్ ఛటర్జీగారు తమ “పృశ్నిగాథ"యను గ్రంథ పీఠికలో ఇదే మంత్రము నుదాహరించి దానికిట్లు అర్థము వ్రాసినారు: “మఘవంతుల (Magians ఈరాను దేశజాతి) సంఘమును గురించియు అసురను గురించియు (అహుర అను రూపముతో ఈరానులో పూజింప బడుచుండిన దేవత) ఇప్పుడు నేను అసాధ్యుడైనట్టియు (దుస్సీమ - Indomitable) బలవంతుడైనట్టియు, (పృథువాన్ Redoubtable) రామునితో (అనగా) వేనునితో మాట్లాడుచున్నాను.” ఛటర్జీగారి అభి ప్రాయములో రాముడు, వేనుడు ఉభయులును ఒక్కరే అయితే యీ వేను డెవడు?

"యజ్ఞ రథర్వా ప్రథమః ప్రథన్ తతే తతో సూర్యో ప్రతపావేన అజని" ఋగ్వేద – 1,8,3,5.

మొదట అథర్వానుడు (జరథుస్తుడు) యజ్ఞపథమును ఏర్పాటు చేసెను. తర్వాత సూర్యవంశమువాడును సత్యవంతుడును (ప్రతపా) అయిన వేనుడు వచ్చెను అని జతీంద్రుడు పృశ్నిగా థాపీఠికలో 'వ్రాసెను. అతని సిద్ధాంతము తృతీయ పంథగా ఉన్నది. దానిని కొన్ని మాటలలో తెలుపుచున్నాను.

ఋగ్వేదములో అసురులు మంచివారే, దేవతలకు అసురులకు భేదము లేకుండెను.

“సమిద్యే ఆగ్నౌ కృతమిద్ వదేమ మహద్ దేవానాం అసురత్వ మేకం" ఋగ్వే. 3-55-1.