పుట:రామాయణ విశేషములు.pdf/95

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 45.


భారతకాలము కలియుగాదిలో అనగా కలియుగమందు ఇంచుమించు 653 సంవత్సరాలు గడచిన తర్వాతిదని కల్హణ పండితుడు అభిప్రాయ మిచ్చినాడు. దుర్యోధనుని తొడలను భీముడు విరుగగొట్టినపుడు శ్రీకృష్ణుడు బలరామునితో కలియుగము ప్రవేశించినది కదాయని సమా ధానమిచ్చెను. శ్రీరాముడు భారతకాలముకన్న పూర్వుడు కాన అతడు క్రీ. పూ. 2500 లో నుండియుండవలెను. ఒక విధముగా శ్రీరామునికిని శ్రీకృష్ణునికిని అంతగా అంతరము లేకుండెనని నేను అనుకొనియుంటిని. ఈ విషయమునే నా హిందువుల పండగలు అను గ్రంథములో పరశురామజయంతి చర్చలో ఇట్లు వ్రాసినాను.

పరశురాముడెట్లు రామాయణ భారతకాలములందు రెండు యుగాంతరములందు జీవించెను? దీనివలన శ్రీరామ శ్రీకృష్ణుల కాలము లందు చాల వ్యత్యాసము లేదనియు ఇంచుమించు వీరు సమకాలికు లనియు చెప్పవచ్చును. పరశురాముడు రామాయణ భారతకాలములో నుండుటను సమన్వయించుటకై పౌరాణికులతనికి చిరంజీవిత్వసిద్ధి నియ్య వలసివచ్చెను. యథార్థమేమన, శ్రీరాముని వార్ధక్యదశలో శ్రీకృష్ణుడు బాలుడుగా నుండియుండును. రామాయణ భారతములందు కనబడు వీరులలో పరశురాము డొక్కడేకాడు హనుమంతుడు భారతములో వృద్ధుడుగా కానవచ్చుచున్నాడు. ఇంకను కలరు. ఎట్లనగా సౌగంధికాపహరణ సందర్భములో (2) బభ్రువాహనుడు —— ఇతడు బొంబవంతుని మనుమడు. ఇతడు భారతవీరులలో నొకడు. (8) విభీ షణుడు--నలుడు దక్షిణ దిగ్విజయానికి వెళ్లినప్పు డితడు లంకలో వృద్ధుడై రాజ్యము చేయుచుండెను. (4) పరశురాముడు ఇతడు వసిష్ఠుని మనుమడు.