పుట:రామాయణ విశేషములు.pdf/94

ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 రామాయణ విశేషములు

ప్రాముఖ్యమియ్యబడెను. అయినప్పటికినీ ఇంద్రుడు పెద్దవాడుగను విష్ణువు తమ్ముడుగను (ఉపేంద్రుడుగను చాలాకాలము చిత్రింపబడుచు వచ్చినారు. పూర్వ వాసన త్వరగా పోనందున ఈ సమాధానము పౌరాణికులచే కల్పింపబడినట్లున్నది. రామాయణములో అయిదారు లావులలో ఇంద్రపూజను గురించిన ముచ్చట వ్రాయబడియున్నది. ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణిమాస్యాం మహీతలే ఆశ్వయుక్సమయే మాసి గతశ్రీకో విచేతనః. -కిష్కింధ 16-87 అధోక్షితః శోణితతోయ విస్రవైః సుపుష్పితాశోక ఇవానిలోద్ధతః విచేతనో వాసవసూను రాహవే విభ్రంశితేంద్రధ్వజవత్ క్షితింగతః. -కిష్కిం. 16-39.

రాముడు వాలిపై బాణము విడిచినప్పుడు అతడు పూజానంతరము క్రింద పడద్రోయబడిన ఇంద్రధ్వజమువలె విగతచేతనుడై పడిపోయెనని వర్ణించు సందర్భములో పై శ్లోకములు కానవచ్చుచున్నవి. "గౌడదేశమందు ఆశ్వయుజ పూర్ణిమనాడు ఇంద్రునుద్దేశించి ఒక పెద్ద గడకు ధ్వజముకట్టి. పూజించి యుత్సవానంతరము దానిని పడద్రోయుట సంప్రదాయమై యుండెను” అని వ్యాఖ్యాతలు వ్రాసినారు. రామాయణకాలములో దేశ మంతటను ఆ యాచార ముందెనని మూలములో నుండుటచే గౌడదేశ జ మందే యుండెననుట సరికానేరదు. ఈ వర్ణనను బట్టి రాముని కాలములో ఇంద్రపూజకై ఆశ్వయుజ పూర్ణిమ నిర్ణయింపబడెననియు దేశమంతటను ఇంద్రపూజలు జరుగుచుండెననియు ఊహించు నవకాశమున్నది. ఇంద్ర పూజలు కేవలము భారతీయార్యులలోనే కాక ఏషియా మైనరులోని హట్టి దేశములోను క్రీ. పూ. 1400 ప్రాంతములోనుండెను. ఈ కారణముచే రామాయణము క్రీ. పూ. 1400 కంటె చాలా పూర్వముదగును. మహా