పుట:రామాయణ విశేషములు.pdf/93

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 48


అచ్చట నానానగరాలు, మండలాలు, ప్రభుత్వాలేర్పడెను. కురుపాండవుల పక్షముగా దక్షిణదేశమునుండి, ఆంధ్రపాండ్యాది ప్రభుత్వాలవారు గొప్ప సేనలతో సహాయార్థమై వెళ్ళిరి. అటవీప్రదేశము నాగరకత చెందిన దేశముగా మారుటకు 800 ఏండ్లయినను పట్టియుండును. ఈ విధముగా చూచినను రామునికాలము క్రీ. పూ. 2500 పూ. 2500 నాటిదై యుండును. (Count Bjornstjerna) జోరెన్సు జొర్నాగారు మహాభారతము క్రీ.పూ. 2000 కన్న పూర్వమున్నదని అభిప్రాయపడినారు. ఈ కారణముచేతను రామాయణము క్రీ. పూ. 2500 నాటి దనవలసియుండును.

ఇంద్రపూజాప్రాముఖ్యము

రమేశచంద్రదత్తుగారు ఒక అంశాన్ని స్పృశించి విడిచినారు. ఆది యింద్రపూజను గురించిన చర్చ. వైదిక పౌరాణికయుగాలను నిర్ణ యించుటకు ఇంద్రపూజ ఒక మంచి మైలురాయి. ఇంద్రపూజ విశేషముగా నుండెనా అది వేదకాలానికి సంబంధించినది. వైష్ణవప్రాముఖ్య మెక్కువగా నుండెనా అది భారతకాలము తర్వాతది అని నిర్ణయింపవలసి యుండును. మహాభారతములో శ్రీకృష్ణుడు గోవర్ధనధారిగా వర్ణింపబడినాడు. శ్రీకృష్ణుడు తన కాలములో వర్తించుచుండిన ఇంద్రపూజను తొలగించి విష్ణుపూజను ప్రచారములోనికి తెచ్చెను. ఈ మార్పుచేత ఇంద్రునికి కోపము వచ్చుననియు అతనివల్ల అందరికిన్నీ మహాబాధ కలుగుననియు జనులు భయపడిరి. అందులకు తగినట్లుగా అప్పుడు పానగండ్ల వర్షమున్నూ ధారావర్షమున్నూ విపరీతముగా దినాలపేరట కురిసెను. జనులు భయభ్రాంతులైరి. కృష్ణుడు వారికి ధైర్యము చెప్పెను. ఇదే గోవర్ధనగిరి గాథా విశేషమైయుండును. కృష్ణుని జీవితములో ఒకటి రెండుమార్లు ఇంద్రునితో కలహము కలిగినట్లు కనపడుచున్నది. పారిజాతముకొరకై ఒక తడవ యుద్ధము జరిగెను. దీనినిబట్టిచూడ ఇంద్రాధి పత్యము శ్రీకృష్ణుని కాలములో తొలగింపబడెను. వైష్ణవతత్వమునకు