పుట:రామాయణ విశేషములు.pdf/92

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు


విష్ణు పురాణము ధీరేంద్రనాధపాలు బంకించంద్ర బాలగంగాధరతిలకు

" 1530 1520 "" 1400 " కోల్ర్బూకు " " " " " " విల్సస్ ఎలిఫిన్ స్టన్ విల్ఫర్డు జకానన్ ఫ్రాట్ " " " " " 1 1870 " " 1300 " 1300 "

శ్రీ పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు తాము స్వయముగా “భారతయుద్ధము క్రీస్తునకు పూర్వము 16 శతాబ్దమఁదు జరిగిన "దని వ్రాసినారు. మోహన్ జోదారో పరికరాలను బట్టి పరిశోధకుల అభిప్రాయములో ఆర్యుల నాగరికత క్రీ. పూ. 8000 ఏండ్లకు పూర్వమునుండియే వచ్చినదని వ్రాసినది సమంజసముగా కనబడుచున్నది దానినిబట్టి రామాయణము 2500 ప్రాంతములోనిదని ఊహింపవచ్చును. మహాభారత రచనాకాల నిర్ణయము నీ చర్చలో ప్రధానముగా పెట్టుకొనుట అప్రస్తుత మగును. టూకీగా ఇంతమాత్రము చెప్పవచ్చును.

భాగవత, మత్స్య, వాయుపురాణములలో మహాభారత కాలము క్రీస్తునకు పూర్వము 15725 అని నిర్ణయింపబడినది విష్ణుపురాణములో క్రీ. పూ. 1580 అని చూపబడినది. అదంత వ్యత్యాస హేతువు కాదు. ఈ నాలుగు పురాణాలలోని రాజవంశావళి కాలాలను అబద్దమని త్రోసివేయ వీలులేదు. కావున మహాభారత యుద్ధకాలము క్రీ. పూ. 1585 గా గ్రహింపవచ్చును. రామాయణ కాలములో వింధ్యకు దక్షిణముననుండిన దేశాలు అరణ్య ప్రదేశాలై యుండెను. మహాభారత రచనాకాలమునాటికి