పుట:రామాయణ విశేషములు.pdf/91

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 41


అతిపురాతన పిరమిడ్లనాటి రాజులకును ముడిపెట్టుచున్నారు. చర్చ మనకు సంబంధించినది కాదు చెప్పబోయిన దేమనగా, రామాయణ మూలగ్రంథ రచనయు, రాముని యునికియు, వాల్మీకి కాలమును క్రీ.పూ. 1400 కంటె పూర్వముదనియు, బహుశా క్రీ.పూ. 2500 ఏండ్ల నాటిదనియు నేను అభిప్రాయపడుచున్నాను. రామాయణము భారతము కన్నను పూర్వముదనుటలో సందేహములేదు. ఒక రిద్దరు అది తర్వాతి రచన యనినను అది రామాయణమందలి ప్రక్షిప్తభాగానికిమాత్రమే వర్తించును. మహాభారతములో రామాయణ కథాసంగ్రహము వ్రాయ బడినది. మరియు కొన్ని నీతులు రామాయణములోనివని చెప్పి యుదాహరించినారు. కావున మహాభారతము రామాయణముకున్న తర్వాతిదే.

మహాభారతకాలము

మహాభారత వీరు లుండిన కాలమును గురించి మహాభారత యుద్ధము జరిగిన కాలమును గురించి వివిధ పరిశోధకులు వివిధరీతిగా అభిప్రాయము లిచ్చినారు. శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ మహాభారత చరిత్రములో ఇట్లు వ్రాసినారు :

“మహాభారత యుద్ధకాలమునుగురించి ప్రాక్పశ్చిమదేశస్థ గ్రంథ కర్తల అభిప్రాయములు క్రింద నిచ్చుచున్నాను. పంచాంగక రలు క్రీస్తునకు పూర్వము 8100 ఏండ్లు కల్హణుడు 2447 " " " సుధా(ర)క రుడు 2447 " 1565 " " భాగవతము మత్స్య పురాణము వాయు పురాణము = "" " "