38 రామాయణ విశేషములు
మొదట పాశ్చాత్య సాంస్కృతిక పరిశోధకుల యభిప్రాయము
కనుగొందము. "కెప్టన్ ట్రాయర్" ఇట్లు వ్రాసెను: “హిందువుల గొప్ప
రాజ్యాలు మా క్రీస్తుశకమున కంటే కనిష్టము 8000 యేండ్లకు ముందే
చాల నాగరికత పొంది యుఁడెనని విశ్వసింతుము. అంతకు పూర్వమే
రామాయణ కథానాయకుడైన రాముడు ఉండెనని చెప్పవలసియున్నది.[1]
పాశ్చాత్య పండితులలో రామునికి ఇంతటి ప్రాచీన కాలమును నిర్ణయించినవారు ఈ ట్రాయర్ పండితులొక్కరే. ప్రొ. హీరెన్ గారు ఇట్లు వ్రాసినారు:
“అయోధ్యానగరము క్రీ.పూ. 1500 నుండి 2000 ప్రాంతములో నిర్మింపబడినదని చెప్పినచో అదెన్నటికిని అతిశయోక్తి కానేరదు.”[2]
పౌష్ (Fauche) అను ఫ్రెంచి పండితుడు క్రీ. పూ. 1320 లో రామాయణము రచింపబడెనని వ్రాసెను. ఇటలీ భాషలోనికి రామాయణమును భాషాంతరీకరించిన గొర్రెసియో (Gorreso) అను నతడు క్రీ.పూ. 1400 లో రామాయణము రచింపబడినట్లు అభిప్రాయపడెను. ఆర్ధర్ లిల్లీ అనువాడు ఇట్లు వ్రాసెను: “ప్రపంచములో రచితములయిన గాథలలో రామాయణము ఉత్తమస్థానము వహించుచున్నది. అది 30 లేక 40 శతాబ్దములనుండి ప్రచారమందున్నది.” మొత్తముపై చాలామంది
పాశ్చాత్య పండితుల అభిప్రాయములో క్రీ. పూ. 1400 ఏండ్లకన్న పూర్వములో రామాయణము లేకుండెను. మరొక పాశ్చాత్యపరిశోధక
- ↑ I cannot refuge credence to this fact Viz. that the great states highly advanced in civilization, existed at least 8,000 years before our era. It is beyond that limit that I look for Rama, the hero of the Ramayana.
- ↑ Prof. Heeren-Historical researches, Vol. II. Page 227.