పుట:రామాయణ విశేషములు.pdf/86

ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 రామాయణ విశేషములు


"సీతపై జనులు నిందమోపిరని గర్భవతియగు సీతను కానకు బంపెను. ఆమె వాల్మీకి ఆశ్రమమున జేరెను. అచ్చటి మునులును సీతను సందేహించిరి. అప్పుడు సీతను పరీక్షించుటకై మును లిట్లనిరి: 'ఇచట టిటిభ సరస్సు కలదు పూర్వమొక టీటిభిని భర్త శంకించి దూషణ చేసెను. టీటిబి ఆక్రందించెను. ఆ సరస్సును దేవతలామె శుద్ధ్యర్థమై నిర్మించిరి. అందు సీత తన పారిశుద్ధ్యమును రుజువు చేయ గాక!' సీత ఆ సరస్సులో దిగి అవతలిగట్టు చేర భూదేవిని ప్రార్థించెను. ఆమె సీతను ఒడిలో నుంచుకొని అవతలిగట్టు చేరెను....”