పుట:రామాయణ విశేషములు.pdf/83

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 33

అతని యాజ్ఞ నుల్లంఘించను" అని యనెను. మరెట్లు? మరెట్లు? "నా పాచుక లిత్తును తీసుకొనిపొమ్ము” అనెను. అట్లే భరతుడు పాదుకలను సింహాస నముపై నుంచి రామునిపక్షముగా పాలించెను. 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత రాముడు తిరిగివచ్చి పట్టాభిషిక్తుడై 16,000 ఏండ్లు పరిపాలించెను.

బుద్ధుని పూర్వజన్మలో ఈ కథ జరిగెను. శుద్ధోదనుడే దశర థుడు. రామునితల్లియే మాయాదేవి. సీతయే రాహులుని తల్లి. ఆనందుడే భరతుడు. శారిపుత్రుడే లక్ష్మణుడు. బుద్ధుడే రాముడు.

ఇది దశరథ జాతకము అను పేరుగల కథ. బుద్ధుని మత వ్యాప్త్యనంతరము అతని గొప్పతనము నిరూపించుటకు భక్తులచేత ఇట్టి "జాతక కథలు” కొల్లలుగా అల్లబడెను. దీని నాధారముగా చేసు కొని విమర్శించుట చాలా దుర్బలమగు వాదము. సుప్రసిద్ధమగు రామా యణకథను బౌద్ధులు తమ జాతక కథలోనికి తమ కవసరమగు మార్పు లతో స్వీకరించినారని స్పష్టముగా వ్యక్తమగుచున్నది.

ఇందులో ఇంకొక విశేషమున్నది. ఈ బౌద్ధ రామాయణములో రాముడును సీతయు అన్న చెల్లెండ్రుగా నిరూపింపబడినారు. వీరిరువురికిని పెండ్లి యైనట్లు ఈ జాతక కథ తెలిపినది. ఇదేమి చిత్రమనగా శక జాతిలో (Scythian) ఈ యాచారముండెనని పీకాక్ గారు తెలిపినారు[1] అయితే యీ యాచారము ఆర్య హిందువులలో ఏనాడును ఎందును లేకుండెను. ప్రధానాదర్శమందే భిన్నించిన యీ విధానమునుబట్టి బౌద్ధులు సుప్రసిద్ధ రామాయణమును అనుసరించి ఒక జాతక కథను కల్పించినా

రని వెల్లడి యగుచున్నది.

  1. Peacocke India in Greece. PP 191-195.