32 రామాయణ విశేషములు
హిందూ పౌరాణిక సంప్రదాయమే. విద్వద్వరేణ్యులు ఈ జైన రామా యణము అంతర్భాగముగా కలిగిన త్రిషష్టి శలాక పురుష చరితను చదివి తమ పరిశోధన ఫలితమును ఆంధ్రులకు ప్రసాదింతురుగాక!
బౌద్ధజాతక రామకథ
వెబర్ అను పాశ్చాత్య పండితుడు జాతక కథలలోని “దశరథ జాతకము" అను కథను ఆధారముగా చేసికొని ఒక పిచ్చి సిద్ధాంతమును చేసి రామాయణము క్రీ.శ. 400 లో వ్రాయబడినట్టిదని చాలా అవస్థపడి వాదించినాడు. బౌద్ధజాతక కథలలోని విశేషమేమో దాని సారాంశ మిచ్చట వ్రాయుచున్నాను.
పూర్వకాలమందు వారణాసిలో దశరథుడను రాజుండెను.
అతని భార్యకు 18000 దాసీ జనముండెను. ఆ దంపతులకు యిద్దరు,
కుమారులు ఒక కూతురును కలిగిరి. కుమారుల పేరులు రామ లక్ష్మణులు.
బిడ్డ పేరు సీత. రాణి చనిపోయెను. రాజు మరొకతెను పెండ్లా
డెను. ఆమెకు భరతుడనువాడు పుట్టెను. వాడు ఎనిమిదేండ్లవాడు కాగా
రాణి భర్తతో యిట్లనెను. "రాజా! పూర్వము నాకొక వరమిచ్చి యుంటివి.
యిప్పుడు దానిని పూర్తి చేయుము. నా కుమారునికి రాజ్య మిమ్ము.".
తన మొదటి భార్య సంతానాని కపాయ మగునని రాజు భయపడి వారిని
12 ఏండ్లవరకు వేరు చోట నుండుటకై నియోగించెను. జ్యోతిష్కులు
దశరథునితో తానింక 12 ఏండ్లవరకు బ్రదుకునని చెప్పినందున పై
విధముగా వారికి చెప్పెను. సీతారామలక్ష్మణులు హిమాలయానికి
వెళ్ళి అచ్చట నివసించిరి. తొమ్మిదేండ్లు గడచిన తర్వాత జ్యోతిష్కుల
లెక్కలను తప్పుజేయువాడై దశరథుడు చనిపోయెను. రాణి తన
కుమారునికి పట్టము గట్టి జూచెను. కాని భరతుడు రామాదులను తెత్తునని
బయలుదేరి రాముని కాంచెను. రాముడు రాజ్యము స్వీకరింప నిరాకరిం
చెను. “నా తండ్రి 12 ఏండ్లవరకు నన్ను రాజ్యములోనికి రావలదన్నాడు.