పుట:రామాయణ విశేషములు.pdf/79

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 29

లక్ష్మణ సహాయార్థమంపెను. అంత రావణుడు సీతనెత్తుకొని విమాన ములో వెడలిపోయెను,

సీతాన్వేషణము 6

సీతకై రాముడు వెదకి వెదకి విఫలుడయ్యెను. అంతనొక సంఘటనము జరిగెను. సహజజాతి అనువాడు సుగ్రీవుని భార్యయగు తారను ప్రేమించి మాయచే సుగ్రీవుని నేషమున నామెతో క్రీడించెను. నిజమైన సుగ్రీవుడు వచ్చి చూచి మాయాసుగ్రీవునితో తగవులాడి యోడిపోయి రాముని నాశ్రయింప నతడు యథార్జమునెఱిగి దొంగమగని జంపి సుగ్రీవునకు తారను, రాజ్యము నిప్పించెను.

పిమ్మట హనుమంతుడు లంకజేరి సీతనుచూచి రావణుని కిరీటమును తన్ని లంకను దహించి తిరిగివచ్చెను. రాముడు సుగ్రీవ హనుమదాదుల సైన్యములతో లంకను ముట్టడించి రావణునితో యుద్ధము చేసెను.

యుద్ధకాండము 7

రావణుడు ఇంద్రజిన్నాగములతో రామసైన్యమును గట్టెను. లక్ష్మణుడు తన గరుడవాహనమును పిలిచి నాగముల నాశనము చేసెను. రావణుడు లక్ష్మణునిపై శక్త్యాయుధము ప్రయోగింప అతడు చచ్చినట్లు క్రిందపడెను. భామండలుడు 'ద్రోణఘము' నుండి అమృతము తెచ్చి లక్ష్మణుని బాగుచేసెను. లక్ష్మణుడు అపుడు గరుడారూఢుడై తన చక్రముతో రావణుని తలదునియెను.

ముగింపు '8'

విభీషణుడు లంకకు రాజయ్యెను. కుంభకర్ణుడును ఇంద్రజిత్తును చిన్నచిన్న రాజ్యములకు రాజులయిరి. రాముడు పుష్పవిమానములో అయోధ్యచేరెను. రాముడు పట్టాభిషిక్తుడయ్యెను. సీతతోడను, ప్రభావతి,