పుట:రామాయణ విశేషములు.pdf/77

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 27


శ్రీరాముని జననము '4'

హిమచూడాదేవి భర్తయు వజ్రబాహు పురందరుల తండ్రియు నగు విజయుడు అయోధ్య నేలుచుండెను. వజ్రబాహునకు కీర్తిధరుడు, అతనికి కోసల, అతనికి హిరణ్యగర్భుడును బుట్టిరి. అతని తర్వాత 27 గురు రాజులు రాజ్యము చేసిరి. కడపటివాడగు అనరణ్యుడు రఘు రాముని కుమారుడు. అతనికి దశరథుడు పుట్టెను. ఇక్కాలమం దొక నాడు రావణుడు వినోదార్థముగా నారదునితో నిట్లనెను: “ఓయి నారదా! నేనెప్పుడు మరణింతునో చెప్పగలవా?" నారదుడు గుణించి యిట్లు చెప్పెను: "దశరథునికొడుకును జనకునికూతురును నీకు మరణమ ను ప్రసాదింతురు.” రావణు డులికిపడెను. కాని విభీషణు డతని భయముపోనార్చి వారికి సంతానము కలుగకపూర్వమే వారిరువురుని సమయింతును చూడుడని చెప్పి బయలుదేరెను. నారదుడంతకుమున్నే యా యిద్దరి కీ వార్త నంపెను. దశరథుడును జనకుడును భీతిచే తమ సింహాసనములపై తమ విగ్రహములు నునిచి యిద్దఱును గలసి యెటకో పోయిరి. తెలివిదప్పిన విభీషణుడు వారి విగ్రహములు పగులగొట్టి తృప్తి నొంది తిరిగిపోయెను. దశరథుడు తన నలుగురు భార్యలతో మగధ దేశము చేరెను. ఈ నలుగురి పేర్లు అపరాజిత, సుమిత్ర, కైకేయి, సుప్రభ. అందు కైకేయి యను నామెభర్తకు ప్రవాసమందొక యుద్ధ మందు సాయపడుటచే ధర్త ప్రీతుడై రెండు వరములు కోరుకొమ్మనెను. కైకేయి వలయునపుడు కోరుకొందునని చెప్పెను. పిమ్మట దశరథునికి నలుగురు కుమారులు పుట్టిరి. అపరాజితకు పద్ముడు పుట్టెను. ఇతడే రాముడు. సుమిత్రకు లక్ష్మణుడు పుట్టెను. ఇతడు నీలవర్ణుడు. విష్ణ్వవ తారుడు. కాన నారాయణుడను పేరుపొందెను. కైకేయికి భరతుడును, సుప్రభకు శత్రుఘ్నుడును పుట్టిరి. ఇక్కాలమున జనకునకు విదేహవలన సీతయను కూతు రుద్భవించెను. ఒకనాడు బర్బర దేశమందలి మయూర మాలకు రాజైన అంతరంగమ యను మ్లేచ్ఛుడు మిథిలపై దాడివచ్చెను.