పుట:రామాయణ విశేషములు.pdf/76

ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 రామాయణ విశేషములు

బొనరించినాడో గమనించితివా? ఉత్తమనాయకుని వదలి ఒక సాధారణ జనుని నీ కంటగట్టెను. అమృతమొక దినమైన త్రాగిన మేలు. యావజ్జీ వము విషము త్రాగుట పొసగునే!”. ఈ మాటలు విని అంజనాసుందరి యేమియు ననలేదు. ఈ సంభాషణము పవనాంజయుని చెవినిబడెను. పెండ్లియైన వెంటనే భార్యనొక గదియందుంచి యామెను పలుకరింపక పోయెను. అంత కొంతకాలమునకు రావణుడు వరుణునితో యుద్ధము చేయువాడై పవనాంజయుని సాయము కోరెను. పవనాంజయుడు ప్రయాణమైపోవుచు మార్గమధ్యమం దొక పెంటియంచ విభుని ప్రవాస మునకు వగచుచు విరహతాపమొందుట గాంచి తన భార్య జ్ఞాపకమునకు వచ్చి వెంటనే రహస్యముగా తన నగరు చేరి అంజనాసుందరితో భోగించెను. పిమ్మట యదేరాత్రి తాను మరలిపోవునపుడు తన ముద్రాంగుళీయకము నామెకు గుఱుతుగా నిచ్చిపోయెను కొన్ని మాసాలతర్వాత ఆమెలో గర్భచిహ్నములను జూచి ఆ తమామలు ఆశ్చర్యాత్ములై యామె వ్యభిచరించెనని భావించి యెన్ని చెప్పినను వినక యామెను వెడలనడచిరి. ఆమె హను పురమను పట్టణమందు నివసించుచుఁడ ఆమెకు కుమారు డుద్భవించెను. ఆ కుఱ్ఱనికి హనుమంతుడను జన్మస్థానపుబేరును బెట్టెను. భర్త యుద్ధమునుండి మరలి వచ్చి తన భార్యకు కావింపబడిన అపచారమును విని చింతించి యామెను వెదకి మరల తన యింటికి బిలిచికొనివచ్చెను. హనుమంతుడు పెద్దవాడై తన తండ్రివలెనే రావణునికి యుద్ధములందు చాల సహాయము చేసెను. రావణుడు ప్రీతుడై సత్యవతియను తనకూతు నతనికిచ్చెను. శూర్పణఖ కూడ తనకూతురగు అనంతకుసుమ యనుదాని నతనికిచ్చెను. ఈ ఇద్దరి భార్యలతో హనుమంతుడు తన దేశమునకు మరలి వచ్చి నప్పుడు సుగ్రీవుడును, నలుడును, తమ మిత్రుడగు రావణునికి సాయ పడినందున హనుమంతునికి తమ కూతులగు పద్మరాగ, హరిమాలిని అను వారినిచ్చి పెండ్లిచేసిరి.