పుట:రామాయణ విశేషములు.pdf/75

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 25

పేరువచ్చెను. రావణుడెట్టకేలకు ముక్తినొంది మారుతరాయడు యజ్ఞము చేయుచు జీవహింస చేసినందులకు కుపితుడై యా యజ్ఞమును ధ్వంసము చేసెను. పిమ్మట నలకూబరుడను రాజు ప్రజాపీడకుడని విని వానిని శిక్షింప రావణుడు బయలుదేరెను. కాని నలకూబరుని భార్యయగు ఉప రంభ తన భర్తను సన్మార్గమునకు ద్రిప్పెదనని వేడుకొనగా రావణుడు క్షమించి వెడలిపోయెను. పిమ్మట రదనపుర రాజగు ఇంద్రుని జయిం చెను. ఇంద్రు డింతవర కజేయుడుగానుండి యిప్పు డోడిపోయి దుఃఖించు చుండ నొకముని యిట్లు చెప్పెను: “నీవు ఆనందమాలిభార్యయగు అహల్య నవమానించియుంటివికాన నీ కిప్పుడీ యవమానము కలిగినది.” ఇట్లు దిగ్విజయోన్మత్తుడై రావణుడు తన రాజధాని కరుగుచుండ అనంత వీర్యుడనుముని యతనితో నిట్లనెను: "ఓయీ! నీవు పరదారాసక్తుడ వగుటంజేసి నీ వింతలో వాసుదేవుని యంశసంభూతుడగు వాని భార్యను చెరపట్టుదువు, దానివలన నీకు మరణము తప్పదు.” ఈ మాటలను విని రావణుడు కటకటబడి తన్ను తానై కోరని స్త్రీని ఇకముందు పొందనని శపథముచేసిపోయెను.

హనుమంతుని జన్మకథ (3)

మహేంద్రపురమునకు మహేంద్రుడను రాజుండెను. అతనికి హృదయసుందరివలన అంజనాసుందరి యను కూతు రుద్భవించెను. అనేకరాజు లీమెను వివాహమాడగోరిరి. అందు ఇద్దఱుమాత్రము మహేంద్రున కిష్టులైరి. అందొకడు విద్యుత్ప్రభ యను సతడు. అతడు ధనవంతుడు, రూపవంతుడు కాని అల్పాయుష్మంతుడని విశదమయ్యెను. రెండవవాడు పవనాంజయుడు. అతడు విద్యలలో తక్కువవాడైనను దీర్ఘాయుష్మంతుడగుటచే అంజనాసుందరి నాతనికే వివాహముచేయ నిశ్చయించెను. బంధువులందఱు విచ్చేసిరి. వివాహదివసమున అంజనా దేవిచెలికత్తె యామెతో నిట్లనెను: "అమ్మా! మన రాజేంత పొరపా