పుట:రామాయణ విశేషములు.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రామాయణ విశేషములు

కొందరు పాశ్చాత్యపండితుల అభిప్రాయ ప్రకారము హోమరే రామాయణమునుండి తన కథావస్తువునుగ్రహించెను. “హోమరు వ్రాసిన ఇలియడ్ పురాణము రామాయణముయొక్క ప్రతి ధ్వనియే. మరియు దానియొక్క అస్పష్టమగు అనుకరణము. ఈ అనుకరణము ప్రతి చిన్న విషయములో కూడా స్పష్టముగాను నిరాకరింపరానిదిగానూ కనపడు చున్నది" అని యం. జల్లికోట్ పండితుడు వ్రాసినాడు. [1]

హిప్పోలిట్ ఫౌష్ (Hippolyte Fauche) ఇట్లనెను: “రామాయణము నుండియే ఇలియడ్ ఏర్పడినదని పూర్తిగా విశ్వసించుచున్నాను."[2]

ఎమిల్ బుమౌఫ్ (Emile Bumouf) క్రీ. శ. 1888 లో ఇట్లు వ్రాసెను: “ఈ 19 వ శతాబ్దములో రెండు ఆశ్చర్యాలు సంభవించెను. (1) క్రైస్తవమతమునకు సంబంధించిన చాలావిషయాలు హిందువులనుండి వచ్చినవనియు, (2) గ్రీకు పురాణాలు స్వతస్సిద్ధములు కావనియు తెలిసెను. గ్రీకు దేవతలును శూరులును కలిసి యొక సుందరాంగి మానభంగమునకై పగతీర్చుకొనుటకు గుమికూడుకథ అంతకుపూర్వమే గంగాతీరములో రచితమైయుండెను. [3]

  1. The Iliad of Homer is nothing but an echo an enfeebled souvenir of the Ramayana.... .... The imitation is flagrant, undeniable, met with even in details. - M. Jellicot in Bible in India. P. 32.
  2. Rama & Home.-Lille p. 175.
  3. “The 19 th century had experienced two great surp-rises ( 1) The Indian origin of much that is called “Christianity,” (2) and that the Greek epics were not original, and even the great hordes of Gods and men and their muster to avenge the rape of a pretty woman had been previously made into a great epic on the banks of the Ganges. Ibid p. 175