పుట:రామాయణ విశేషములు.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రామాయణ విశేషములు

వాల్మీకి యాదికవి యని యందరును ఒప్పుకొనుచున్నారు. అతడు శ్లోకమును కనిపెట్టిన కథ అందరకును తెలిసినదే. కాళిదాస మహాకవి వాల్మీకిని 'కవి' యనియే సంబోధించెను. పరిత్యక్తయయిన సీత అరణ్యములో వాల్మీక్యాశ్రమ ప్రాంతములో విలపించుచుండగా వాల్మీకి ఆమెను కాంచెనని కాళిదాసిట్లు వర్ణించినాడు:


తా మభ్యగచ్ఛ ద్రుదితానుసారీ కవిః కుశేధ్మాహరణాయ యాతః
నిషాదవిద్ధాండజదర్శనోత్థః శ్లోకత్వ మాపద్యత యస్య శోకః.
                                     -రఘువంశము. 14 సర్గ. 70 శ్లో.

రామాయణములోనే బాలకాండ ద్వితీయ సర్గమందు క్రౌంచవధ కథ కలదు.


"ఋక్షోభూత్ భార్గవస్తస్మాద్వాల్మీకిర్యోభిధీయతే”

అని విష్ణుపురాణములో కలదు దీనినిబట్టి వాల్మీకికి ఋక్షుడను పేరుండె ననవలెను. ఈ విషయమునుగురించి శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు తమ సంస్కృత వాఙ్మయ చరిత్రలో నిట్లువ్రాసిరి: “ఇరువదినాల్గవ వ్యాసుడు ఋక్షుడనియు 28 వ వ్యాసుడు ద్వైపాయనుడనియు వాయుపురాణము చెప్పినది....ఈ పురాణ సంప్రదాయమునుబట్టియు “భృగు ర్వైవారుణిః” అను తైత్తిరీయోపనిషద్వాక్యమును బట్టియు వరుణ వంశమువాడును భృగువంశమువాడునైన వాల్మీకి యొక డేయనియు, అతడు వేదవ్యాసుడు కూడనై యుండెననియు తెలియుచున్నది."

వెబర్ భారతీయ వాఙ్మయ చరిత్రను వ్రాయుచు నందు తైత్తిరీయ ప్రాతిశాఖ్యలో ప్రాచీనాచార్యుల పట్టికలో వాల్మీకి పేరు కలదని వ్రాసెను.

పర్గిటర్ ప్రాచీన ఋషుల పట్టికను సిద్ధము చేసి అందు వాల్మీకి దశరథునికి రెండు తరముల తర్వాత నుండినట్లు తెలిపినాడు. సంగ్రహ