పుట:రామాయణ విశేషములు.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

xLl

రాహులకును ఆకాలపు దాక్షిణాత్యులకునుఁగల కర్మకాండ వైరుద్ధ్యమును అందురామునకుఁగల యభిమానవిశేషమును దెలుపుచున్నది. ఇది యిట్లుంచి యొక ముఖ్యవిషయమును గొంచెము వివరింతును.

రామాయణము నందలి ఖరదూషణాదులవధ ప్రకరణమున మహేశ్వరతీర్థులను పూర్వవ్యాఖ్యాత శేషధర్మములలోనివని యీ క్రింది,


శ్లో. యాజ్ఞవల్క్యసుతారాజన్ త్రయోవై లోకవిశ్రుతాః
    చంద్రకాంత, మహామేథ, విజయా, బ్రాహ్మణోత్తమాః
    ఖరశ్చ, దూషణశ్చేతి త్రిశిరా బ్రహ్మవిత్తమాః
    ఆసంస్తేషాంచ శిష్యాశ్చ చతుర్దశ సహస్రధా.


అను రెండుశ్లోకముల నుదాహరించియున్నాడు. వీనినిబట్టి ఖరదూషణ త్రిశిరులు యాజ్ఞ్యవల్క్యమహర్షి పుత్రులని తేలుచున్నది. ఇందుపైఁ జూతమని శేషధర్మములను గ్రంథమును వెదుకఁగా నీ కథయందు విరివిగా నున్నది. చంద్రకాంతమహామేథ విజయులు శివునిగూర్చి తపస్సు చేసి కడపట "సంసార విష వృక్షస్యచ్ఛేత్తా భవ మహేశ్వర!" అని యద్దేవుని వరమడుగఁగా వారి వాక్పారుష్యమును గర్హించి మీరును మీ శిష్యులును రాక్షసులై జనస్థానమున వసించుచు శ్రీరామచంద్రునిచేత సంహరింపఁబడి మీ కోరిన మోక్షమును బొందుదురు గాతమని యాయన వరమిచ్చినట్లున్నది. ఈ శేషధర్మములును మహాభారత శేషభూతములే యని చెప్పఁబడును.

పులస్త్య విశ్వామిత్రాగస్త్యుల సంతతివా రనేకులు రాక్షసులైరని వాయ్వాది పురాణములందున్నది, అందు విశ్వామిత్రుని సంతతివాఁడు యాజ్ఞవల్క్యమహర్షి. వాసిష్ఠులకును వీరికిని బొసఁగదు. శ్రీరాముఁడు వాసిష్ఠపక్షీయుఁడనుట ప్రసిద్ధము. రామపత్నియైన సీతాదేవి జనకరాజ పుత్రిగదా! ఆ జనకుని పేరు దేవరాత జనకుఁడని రామాయణాయోధ్యా