పుట:రామాయణ విశేషములు.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

xL

చేరగా నచ్చటి ఋక్షగోలాఁగూలములాతనిఁ గాపాడెననియున్నది. మఱియు-సభాపర్వమునందలి బృహద్రథ వృత్తాంతమును ముఖ్యముగా తద్దుందుభి నిర్మాణకథను బరికింపఁగా రామాయణమునందలి దుందుభి వధఘట్టము జ్ఞప్తికివచ్చుటయేకాక యా బృహద్రథుడే వాలియనియ నాతని యుపాస్యదైవతముగాఁ బేర్కొనంబడిన తారానామక యక్షిణియే తారాయనియు, జరాసంధుఁడే యంగదుఁడనియు నూహింప సాధ్యమగు చున్నది.

5

మహాభారత ద్రోణపర్వమునందలి షోడశరాజోపాఖ్యానములోఁ గల రామవృత్తాంతమునందు జనస్థాననివాసుల విషయమునగల శ్లోకములు గమనార్హములు.


1. శ్లో. జఘానచజనస్థానే రాక్షసాన్ మనుజర్షభః
తపస్వినాం రక్షణార్థం సహస్రాణి చతుర్దశ.
..........................................................................
..........................................................................

2. శ్లో. స్వథాపూజాంచ రక్షోభిర్జనస్థానే ప్రణాశితా
ప్రాదాన్ని హత్య రక్షాంసి పితృదేవేభ్య ఈశ్వరః.

తా॥ సర్వశ క్తి సంపన్నుఁడైన రాముఁడు రాక్షసులచే జనస్థానమునందు నాశనముచేయఁబడిన స్వధాపూజను (పితృదేవతల యారాధన విశేషమును) రాక్షసులనుజంపి మరల నా పితృదేవతలకు సమకూర్చెను అని పై రెండవ శ్లోకముయొక్క తాత్పర్యము. ఇందువలన జనస్థానరక్షోవధకుఁ గారణము పితృదేవతల యారాధనకు వారు భంగముచేయువారగుటేయని తెలియవచ్చుచున్నదిగదా! ఇది యౌత్త