పుట:రామాయణ విశేషములు.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

XXXVI

నిత్య ప్రముదితా స్ఫీతా లంకానామ మహాపురీ
సాకామరూపిణాంస్థానం రాక్షసానాం మహాత్మనాం.

అను నిత్యాది శ్లోకములలో వర్ణింపఁబడినది. ఈ లంకా ద్వీపము 100 యోజనముల పొడవును 30 యోజనముల వెడల్పును గలదట! ఇచేయట కామరూపులగు రాక్షసులకు నివాసస్థానము! ఈ స్థాననిర్దేశ మీ క్రింది విధముగాఁ జేయబడినది.

శ్లో. తస్య దీపస్యవై పూర్వేతీరే నదనదీపతేః
గోకర్ణ నామధేయస్య శంకరస్యాలయం మహత్.

తా. ఆ ద్వీపమునకు సంబంధించిన సముద్రముయొక్క తూర్పు తీరమునఁదు గోకర్ణ నామధేయుఁడగు శంకరుని మహనీయమగు నాలయ మున్నదట

దీనినిబట్టి నేఁటి మార్మగోవా ప్రాంతమున నున్న గోకర్ణ క్షేత్రమునకుఁ బశ్చిమదిశయందు లంకయున్నదని ఖండితముగాఁ జెప్పవచ్చును. మహాభారతారణ్యపర్వము నందలి రామోపాఖ్యానమునందుఁ గూడ రావణుఁడు రథమార్గముననే గోకర్ణక్షేత్రమునందుఁ దపస్సు చేయుచున్న మారీచునికడకువచ్చి వాని సాహాయ్య మభిలషించినట్లు స్పష్టముగాఁ జెప్పఁబడినది. నేఁడీ ద్వీపము శిథిల ప్రాయమై కొంత మునిగిపోగా మిగిలినది గోకర్ణ క్షేత్రమునకు నైరృతిలో ఖండఖండములుగా లక్కాదీవులను పేరఁ గానవచ్చెడిని. అత్యుత్తమసాధన సాధితమైన యీ లంక పశ్చిమసముద్ర తీరస్థము గాని యన్యముగాఁజాలదు.

రాముఁడు శూర్పణఖ ముక్కు గోసిన స్థానముగా మహారాష్ట్రులు నాసికాత్రయంబక స్థానమును ఆంధ్రులు భద్రాచల ప్రాంతమును వర్ణించుచు బహుభంగుల వివాదపడుచున్నారు గదా! ఏ స్థానమునుండి