పుట:రామాయణ విశేషములు.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

xxxiv


శ్లో. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
    పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం.

అనునది ప్రసిద్ధమైన వ్యాసభగవానుని గూర్చిన స్తుత్యాత్మక శ్లోకము. మహాభారతమునందన్ని యెడలను వ్యాసమహర్షివంశమిట్లే చెప్పఁబడినది కావుననిది ప్రమాణము గాదనరాదు అయినచో మన యాఖ్యానమునఁ బేర్కొనబడిన వసిష్ఠుఁడీతఁడే యనగా వ్యాసుని ప్రపితామహుఁడే యనినమ్మి పరిశీలింతుమేని భారతకథానాయకులు వసిష్ఠమహర్షి కాఱవతరము వారగుదురు. ఏలయన వసిష్ఠప్రపౌత్రుఁడైన వ్యాసుడు కురు పాండవుల పితామహుఁడేకదా! మహాభారత రామాయణాది పురాణముల యందొక విషయము పెక్కింటియం దొకేవిధముగా, గాన్పించిన నొకదానియందే పెక్కుసారు లేక రూపముననున్నను నది విశ్వసనీయమైన చరిత్రాంశముగాఁ దలంపవచ్చునని నా యభిప్రాయము. ఈ నిర్ణయముతోడనే నేను నా చరిత్ర రచనను సాగించు చుందును. ఇంతకు మించి మన పురాణ కథల సమన్వయమునకు సరియైన సాధనము గనుపింపదు. వసిష్ఠున కాఱవతరమువారైన కురు పాండవులు వసిష్ఠుని పిమ్మట మూడువందల సంవత్సరములకంటె నర్వాచీను లనుట చారిత్రక పద్ధతి కాఁజాలదు ఇట్లు చూతుమేని మహాభారత కథా కాలమునకు రామాయణ కథాకాలము రమారమి 300 సంవత్సరముల పూర్వపుదై యుండవచ్చును. వాయ్వాది పురాణములలో పరీక్షిజ్జన్మ కాలము మొదలుకొని మహాపద్మనందుని యభిషేక పర్యంతమైన కాలము 1050 సం॥ లనియు 1500 లనియు రెండు విధములైన లెక్కలు చెప్పబడినవి. అందు రెండవ విధమే బహుతుల్యము గావున దానినే మనము గ్రహింతము. నందుని పిమ్మట 100 సం॥లకు మౌర్య చంద్రగుప్తుడు రాజ్యమునకు వచ్చినట్లు పురాణము లన్నింటను గలదు. చంద్రగుప్తుని రాజ్యారంభ కాలము క్రీ. పూ. 320 ప్రాంతముగా నేఁటి చరిత్రకారు