282
రామాయణ విశేషములు
దనియు ఒక చరిత్రకారుడు తెలిపినాడు. అట్లైతే రామాయణములో తెలిపిన దక్షిణమందుండు లంక అబద్ధమగునా?
రామునికాలములో చాతుర్మాస్యమును పాటించుచుండిరి. (కి. 27- 48) ఆషాఢ శ్రావణమాసాలలో విష్ణువు నిద్రించుచుండెను (కి. 28-25).
"ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః”.
అయో. 82-8.
ఇచ్చట కేవలాః అనిన సింహాసనములేనిరాజులు అని అర్థము
చెప్పుదురు. అది నిరర్థక పదమనియు, దక్షిణ దేశములో 'కేరలులు'
ఉండిరికాన కేవలాః అనుటకు మారుగా కేరలాః అని సవరించవలెననియు
వాష్‌బరన్ హాప్కిన్సుగారు (Great epic of India లో) వ్రాసినారు.
వీరి పాఠమే అర్థవంతముగా ఉన్నది. పైగా గుజరాతులో ముద్రించిన
రామాయణములో కేరళాః అను పాఠమే యున్నదని తెలిపినారు తెలుగు
దేశపు పాఠములలో ఈ సవరణను చేసుకొనవలెను.
బాలకాండ సర్గ 45 లో అమృతోద్భవకథను చెప్పినారు. అదంతయు కల్పితమే. ధన్వంతరి సముద్రమథనములో పుట్టెనట! విష్ణు పురాణములో కాశిరాజగు కాశునికి దీర్ఘతముడు. అతనికి ధన్వంతరి పుట్టెననియు, అతనికి కేతుమానుడు, అతనికి భీమరథుడు, అతనికి దివోదాసుడు పుట్టెనని వ్రాయబడినది. ధన్వంతరి శకకర్తయైన విక్రమా దిత్యుని యాస్థానములోని నవరత్నములలో నొకడని "ధన్వంతరి క్షపణకామరసింహశంకువేతాళభట్ట ఘటకర్పరకాళిదాసాః" అను శ్లోకము వల్ల తెలియవచ్చుచున్నది. సముద్రమథనములో సురాపానాధిష్ఠాన దేవత యగు వారుణి పుట్టెనట సురను సేవించినవారు సురలైరనియు, సురను గ్రోలనివారు అసురులైరనియు వ్రాసినారు సురశబ్దార్థముపై యీకథ పుట్టినది. ఋగ్వేదములో 'సుర' శబ్దము లేదనియు, అసురు