పుట:రామాయణ విశేషములు.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

xxxi

దెలుపఁబడినది మఱియు వాలి సుగ్రీవులు సహోదరులని సైత మిందుఁ జెప్పఁబడియుండలేదు. హనుమంతుఁడు "శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం" నూరు యోజముల విస్తారముగల మహాసముద్రమును దాటెను లేక యీదెను అను నీ యర్థముగల వాక్య మతిశయోక్తియై యుండును.

వానరశబ్దము వనచరమాత్రవాచకమని తలంపఁదగియున్నది కనుక వానరు లాటవికులైన మనుష్యులనుట యుక్తము. వాలి వారికి రాజనియు నతని భార్య తార యనియు నిందున్నది. కాని యా వాలి వానరుఁడో తదన్య జాతీయుఁడైన రాజో చెప్పు నవకాశము లేదు. వానరులలో హనుమ త్సుగ్రీవులే గాక "నలంసేతు మకారయత్" అని సేతువు గట్టిన నలునిపేరుగూడ నున్నది. అయినను వీనికి వానరశబ్ద విశేషము లేదు.

ఇంకొక చిత్రమేమనగా రాముని తమ్ములలో శత్రుఘ్నుని పేరెచ్చటను గానరాదు కాని రాముఁ డయోధ్య జేరెనను సందర్భమున “భ్రాతృభిః సహితోఽనఘః" అని భ్రాతృశబ్దము బహువచనము నం దున్నందున శ్రీరామునకు భరత లక్ష్మణులేకాక మఱియొక తమ్ముఁడుగూడ నుండవచ్చునని తెలియుచున్నది. అట్లుకానిచో “భ్రాతృభ్యాం సహితోఽనఘః" అనిమాత్రమే యుండఁదగును.

రాక్షసులలో రావణుఁడును విభీషణుఁడును రాజవంశ్యులుగాఁ జెప్పఁబడియున్నారు. అక్షుఁడను వాడొక సేనాధిపతి యని మాత్రమే తెలియవచ్చుచున్నది ఇంతకుమించి మఱియెవ్వరి పేర్లును గానరావు. అన్నిటికంటెఁ చిత్రము రామజననికిగాని భరతజననికిఁగాని వారి తల్లిదండ్రులు పెట్టుకొన్న పేర్లేమో యీ సంగ్రహమువలనఁ తెలియవచ్చుట లేదు. లక్ష్మణ జనని సుమిత్రా నామధేయురాలగును. కాని యామె యభిజనము తెలియదు - కౌసల్య యనఁగాఁ గోసల రాజపుత్రి లేక