పుట:రామాయణ విశేషములు.pdf/326

ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 రామాయణ విశేషములు రక్షోవర్గము వారు "దైత్యుల ముఖ్యనగరము హిరణ్యపురమని మన పురాణాలు చెప్పెను. అదే యిప్పటి హిర్కేనియా (Hyrcania). ఆ ప్రాంతమందే కాస్పియా దేశముకలదు అచ్చటనే హిరణ్య కశిపు, హిరణ్యాక్షులు రాజ్యము చేసిరి":1 నాగులు మనచర్చకు సంబంధించుకున్నను వారెవరో తెలిపి యీ చర్చముగింతును. వారు హూణులని తెలిపినాను. నందలాల్ గారిట్లు వ్రాసినారు: “సంస్కృతభాషలో సర్పములకిచ్చిన పర్యాయపదములలో హూణులలోని వివిధ జాతుల పేరులు సరిపోలుచున్నవి. హింగ్ నూ (Hiung nu) అనునది హూణుల పేరు. దానినుండి నాగశబ్దము వచ్చినది. సర్ప అనునది సర్తస్ప జాతిపదము, ఉరగ ఊగురుస్ (Uigurs) జాతి పదము. పర్ని, నాగాయ అను రెండు శకజాతులు జక్సార్టీసు నదీ ప్రాంతాలలో నివసించుచుండిరి. ఆ రెండు జాతుల పదమే పన్నగ అయినది. అజి పదమే అహియైనది. ఫణి యనునది ఫనికియాలోని ఫనికుల నుండి ఏర్పడెను "2 హూణులకు మొదటి పేరు తలె (Tele) రసా-తల, అ-తల, కు-తల మున్నగు పేరులు దీనినుండియే వచ్చెను.” సుగ్రీపుడు పశ్చిమదిగ్భాగ మందలి దేశములను తెలుపునప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో ఆపర తాలపర్వత మున్నదనెను. ఈ పదము (లేక హూణుల) జాతిని సూచించునేమో ! తాల రాక్షసుల పర్యాయపదములను చెప్పుచు అమరసింహుడు వారిని శుక్రశిష్యులని ప్రత్యేకముగా తెలిపియున్నాడు. శుక్రుడు రాక్షసులకు కాదుకాని అసురులకు గురువు. అసురులే జరథుస్త్రమతములోని 1. రసాతల పుట. 31-32. 2.. రసాతల - పుట. 51. B. రసాతల - పుట. 9.