రామాయణ విశేషములు
273
చరిత్రకారుడు వ్రాసెను. పాతాళలోకమున కదేద్వారమనియు, అచ్చట అంధకార ముండెననియు గ్రీకులు విశ్వసించిరి. అందుచేత 'కిమ్మీరాంధకారము' అని వారిలో సామెత యయ్యెను."[1]
(ఇదే అజాఫ్ సముద్రమువద్దనుండు ద్వీపకల్పము. ఇప్పుడు క్రిమియా అని యందురు. అనగా కిర్మీరుల దేశము అను నర్థమిందు స్ఫురించుచున్నది.)
రాక్షసులకు 'పుణ్యజనులు' అను నదొక పర్యాయపదము. పుణ్యజనులుకూడ వేరు జాతివారు. నా అభిప్రాయములో ఫనికియా (Phoenicia) దేశ జనులనే మన పూర్వికులు పుణ్యజనులు అని వ్యవహరించి యుందురు. వారిని పూర్వము 'పున' (Puna) అని పిలుచుచుండిరి.[2] ఫణికులు నరబలు లిచ్చెడివారని యిదివరకే తెలిపియున్నాను. రాక్షసులు నరభక్షకులని మనవారనిరి. “గ్రీకుభాషలోఫైనోస్ లేక ఫోనస్ (Phoenus) అనిన రక్తవర్ణము. వారు రక్తవర్ణు లగుటచే అట్లు పిలువబడినట్లున్నది.”[3] ఫణికులు సూర్యుని 'బాల' అను పేరుతో పూజించుచుండిరి. అదే ఋగ్వేదములో 'వల' అనగా సూర్యుడు అను నర్థములో (మండలం 4 సూ. 18 మరియు 33) ప్రయోగింపబడినదని ఒకరు వ్రాసిరి. కాని నాకీ 'వల' పదము ఋగ్వేదములో కానరాలేదు.
యాతు, యాతుధాన పదములు రాక్షసులకు పర్యాయపదములుగా
ఋగ్వేదములో ప్రయోగించినట్లు కనబడుచున్నది. కాని వారు