272
రామాయణ విశేషములు
రావణుని క్షమించి వదలిపెట్టెను”[1] పై విషయములు మనకు కొన్ని సత్యములను బోధించుచున్నవి. రావణుడు దండకారణ్యప్రాంతమం దుండెననియు, వాడు దశరథుని సమకాలికుడనియు, రావణుని షడ్డకు డగు శంబరునితో దశరథునికి వైర ముండెననియు, రావణుడు భార్య చెల్లెలినిగూడ బలాత్కరింపబోయిన దుష్టకాముకుడనియు, రావణుని మర్దించిన శంబరుడే ప్రబలుడనియు దీనివలన విశద మగుచున్నది. ఇంతవరకు అసుర, దనుజ (దానవ) రాక్షసులను గురించి తెలిపినాను. ఇక కిన్నర, కర్బుర, కిర్మీరులను గురించి చర్చింతును. కిర్మీరులను కిమ్మీరులనియు మనవారు వ్రాసినారు. ఈ మూడు జాతులను ఒకే జాతివారని అనుకొనుచున్నాను.
కర్బుర అనిన ఒక చిత్రవర్ణ మనియు దానికి కిర్మీర అను పదము పర్యాయపదమనియు అమరసింహు డనినాడు.
"చిత్రకిర్మీరకల్మాష శబలైతాశ్చ కర్బురే” (ప్ర. ధీవర్గ). కిమ్మీ రులు అను నొకజాతి బహు ప్రాచీనకాలములో ఇప్పటి క్రిమియాలోను, నల్లసముద్ర (Black Sea) ప్రాంతములోను నివసించియుండిరి. బైబిల్ లోని పూర్వ నిబంధనము (Old Testament)లో వీరిని గోమర్ జాతి అని యనిరి. ప్రాచీనశాసనములలో వీరినే గిమ్మరై (Gimittai) అనియు, గ్రీకుల చరిత్రలలో కిమ్మీరులు (Kimmerians) అనియు పేర్కొనిరి.[2] “రష్యాకు దక్షిణభాగములో ఒక సంచార జాతి (Nomads) నివసించు చుండెను. వారిని గ్రీకులు కిమ్మీరులు అని పేర్కొనిరి. అజోఫ్ (Azoff) సముద్రమును నల్లసముద్రములో కలుపునట్టి జలసంధిని కిమ్మరియన్
బాస్ఫరస్ (Cimmerian Bosphorus) అని పిలుచుచుండిరని హెరొడోటస్