పుట:రామాయణ విశేషములు.pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

271

ఈ విధముగా వారు భిన్న దేశములందుండగా మూడు జాతులును ఒక టే యని యెట్లు చెప్పవలెను? అసురులకును దేవతలకును ఎల్లప్పు డును యుద్ధము జరుగుచుండెను. సాధారణముగా దేవతలే ఓడిపోవు చుండిరి. బలము తక్కువకలవారికి ఉపాయములు మెండు. దేవతలలో అదే గుణమే కనబడుచున్నది. ఐతరేయబ్రాహ్మణములో నిట్లువ్రాసినారు:


"దేవా౽సురావా ఏషు లోకేషు సమయతంత... తాంస్తతో సురా అజయన్...
దేవాబ్రువన్ నరాజతయా వైనోజయతి రాజానం, కరవామహే ఇతితథేతి” (1-14)


అసురులకు రాజులుండిరి. దేవతలకు రాజులు లేకుండిరి. ఓడి పోయిన దేవతలు తామును రాజుల నేర్పాటు చేసికొనిరి. అసురులకును దేవతలకును కల ముఖ్యభేద మిందు కానవచ్చుచున్నది.

దండకారణ్యమందలి ఆదిమవాసులలో ఆర్యుల నెదిరించినవారిని కూడా పౌరాణికులు రాక్షసులనిరి. యస్.యన్. ప్రధాన్‌గారిట్లు వ్రాసి నారు: దశరథుడు 'రాజర్షి'యగు దివోదాసునికి సహాయముగా దండ కారణ్యములోని వైజయంత ప్రభువైన శంబరతిమిధ్వజునితోడి యుద్ధములో సహాయపడెను. (ఈ విషయమును అయోధ్యకాండలో 9 సర్గలో చూడ నగును. అందు దివోదాసునికి మారుగా ఇంద్రుడు అని చెప్పినారు.) ఋగ్వేదములో (4, 30, 14) తిమిధ్వజ శంబరుని పూర్వికుడు 'కులితర' అని చెప్పబడినాడు. శంబరునికి 100 నగరా లుండెననియు, వాటిని దివోదాసుడు ధ్వంసము చేసెననియు తెలిపినారు. శివపురాణ ములో (6, 13) మయునికి మాయావతి, మందోదరి యను ఇద్దరు కుమారైలుండిరని తెలిపినారు. మాయావతి శంబరునికి, మందోదరి రావణునికిని ఇయ్యబడెను. రావణుడు మాయావతిని ఎత్తుకొనిపోజూచెను. శంబరుడు వాని నోడించి పట్టుకొనెను. మామయగు మయుని ప్రార్థనపై