పుట:రామాయణ విశేషములు.pdf/319

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

269


“పెద్దలైన మునులు పృథివీస్థలికి రాజు
లేమిజూచి నిమిక ళేబరంబు
దరువ నొకడుపుట్టె తనయుండు వానిని
జనకుడనుచు బలికె జగములెల్ల .


మరియు నతండు విదేహుండు కావున వెదేహుండనియు మథన జాతుడు గావున మిథిలుండనియు ననంబరగె.”

(భాగవతము. నవమ స్కంధము. 370-1)

మగపీనుగనుండి జనించెగాన జనకుండట! ఒక్క నవమస్కంధము లోనే యిన్ని కథలు. తుమ్మునుండి, మగవాని కడుపునుండి, మగపీనుగ నుండి పిల్లలను పౌరాణికులుతప్ప ప్రపంచమందు మరెవ్వరైన పుట్టించి నారా? ఇవి మన పౌరాణికుల ఘోర కల్పనలు!

కావున ఇట్టి కల్పనలలోపల దాగిన మూలవిషయములను విడదీసి తేల్చుట అత్యంతకష్టసాధ్యమగు పనియైపోయినది.

కశ్యపునికి పలువురు భార్యలనియంటిమికదా! కశ్యపుడెవరు? ఆలోచించి పరికించిన కాస్పియన్ సముద్రమే కశ్యపసముద్రము. ఆ సముద్రమునకు భార్యలు దానిలోనికి పారునదులు. డాన్ నది అందు లోనికి పారును. కాన తత్ప్రాంతీయులు దానవులనబరగిరి. దైత్యక అను మరొకనది దానిలోనికి పారును. అందుచేత తత్ప్రాంతీయ జనులు దైత్యులనజెల్లిరి.

రాక్షసులు అను పద మెట్లు వచ్చెనో ఎవ్వరునూ ఊహింపజాల కున్నారు. దైత్య, అసుర, కిమ్మీర, యక్ష, గాంధర్వాది జాతులవలె రాక్షసులును ఒక అనార్యవర్గమువారై ప్రాచీనార్యులకు సన్నిహితులై వారితో తగవులు, బాంధవ్యాలు చేయుచూవచ్చినవారై యుందురు. వారు