266
రామాయణ విశేషములు
అందుచేత ఆర్యులు ఈరానీలనుండి వివాదపడినది స్పష్టము. అసీరియా దేశమువారే అసురులు అని పలువురన్నారు. అయితే అసీరియావారే అసురులని చెప్పజాలము. ముందాజాతిలో ఒక అసుర జాతి యిప్పటికినీ కలదు[1] మొత్తముపై అసురులు రాక్షసులు భిన్న జాతులుగా కనిపించుచున్నారు. దనుజులు అనువారు దనుసంతతివారని స్పష్టమగుచున్నది దానవులు క కేసన్ పర్వతములకు ఉత్తర భూమిలో నివసించినట్టివారు. కీరోపండితు డిట్లు వ్రాసెను:
"దనుజాతి జోర్‌దన్‌నుండి వచ్చెను. వారు వ్యాపించిన ప్రదేశ ములలో తమ జాతినామమును స్థిరముగా ముద్రించిపోయిరి. దాన్‌యూబ్, దానిష్టర్, దానిట్జ్, దాన్‌దారి, దాన్‌రిక్‌గట్లు, దాన్‌మార్క్, ఐర్లాండులోని కొన్ని ప్రదేశాలున్నూ వారి పేరుతో నిండియున్నవి."[2] కావున దానవులు
లేక దనుజులు రాక్షసులతోను అసురులతోను భిన్నించియుండిరి. దానవులు
- ↑
“తే అసురా ఆత్మవచసోహే ఆళవోహే ఆళవ ఇతివదంతః పరా
బభూవుః తస్మాన్నబ్రాహ్మణో మ్లేచ్ఛేత్ అసుర్యాహిఏషావాక్".
శతపథ బ్రాహ్మణము 3-2-123
అసురులు ఆరయః అని యుచ్చరించలేక అలవ అని పరాభూతులై నందున అది మ్లేచ్ఛవాక్కు అని యర్థము కదా! అనురులు మ్లేచ్చులు ఛందో భాషనే అపభ్రంశముగా మాట్లాడిరనుటచే వారు ఆర్యులకు సంబంధించి వేరై పోయినారని యర్థమిచ్చును. పై బ్రాహ్మణ వాక్యాలే మహా భాష్య పశ్పశమందును కలవు. - ↑ The tribe Dan came from the land of Jordan Th s is borne out by the names they left behind in their northward march such as the Dan-ube, Danister, Dan etz, Dan-dari, Dan-ric Alps, Dan-mark. In Ireland are seen such names as Dan-lough, Dan-sower, and Dan-gan - -Cheiro's World Predictions. PP 60-64.