రామాయణ విశేషములు 263 భాషలోకూడ కిన్నెర (Lyre) అనిన మన తెనుగుకిన్నెరవంటిదే. కిన్నెరనుగూర్చి ఆడోనిన్ (Adonis) అను గ్రంథములో (Thinker's library) జే. జీ. ఫ్రేజర్ ఇట్లు వ్రాసెను: “సిరియా సముద్రతీర ప్రాంతమును పూర్వము శకరాజగు కినిరాస్ (Cinyras) ఏలెను. అతడు తంతివాద్యమందు నిపుణుడు. కినిరాస్ పదమునకు స్పష్టముగా గ్రీకు కినిరాతో సంబంధము కలదు కినిరా అన తంత్రీవాద్యము (Lyre). ఆ పదము గ్రీకుభాషలోనికి శకభాషలోని కిన్నర్ (Kinnor) అను పదమునుండి యేర్పడినది. పూర్వకాలమందు జరుసలెంలో తంత్రీవాద్యము దేవుని సేవలో ప్రధానమైనదిగా కానవస్తున్నది. వాద్యగీతముల ద్వారా దేవుని ప్రసన్నునిగా జేసుకొనుచుండిరి. ఈ వాద్యములందే అచ్చటి పూజారులకు ఒళ్ళు నిండుచుండెను.” (పుట. 38). పై విషయాలను బట్టి కిన్నరులనుజాతి శకజాతివారనియు, వారు గానవాద్యములందు ముఖ్యముగా కిన్నెర వాద్యమందు ప్రవీణులనియు వారు సిరియా ప్రాంతమందుండిన వారనియు గ్రహింపవచ్చును. మన పౌరాణికులును కిన్నరులును, గాంధర్వులును (గాంధార దేశమువారు) గీతవాద్యములందు ప్రవీణులని వర్ణించిరి. గ్రీకు పురాణములలో కెంతౌరులు (Centaurs) అను వారుండిరి. వారు సగము గుఱ్ఱము సగము మనిషి ఆకారము కలవారు. వారు లాపితులు (Lapiths) అను మానవజాతితో వైరము కలిగి వారి స్త్రీలను బలాత రింప తల పెట్టుచుండెడి వారగుటచే ఉభయవర్గాలకును నిరంతర యుద్ధములు జరుగుచుండినట్లును, గ్రీకుల సంగీతాధిదేవతయగు అపోలో లాపితుల పక్షము వహించి సాయపడినట్లును గ్రీకు పురాణాలు వర్ణించెను కెంతౌరు పదమే కిన్నర పదమని స్పష్టమగుచున్నది. గ్రీకుల సృష్టిని హిందువులు గ్రహించిరో యేమో?
పుట:రామాయణ విశేషములు.pdf/313
ఈ పుటను అచ్చుదిద్దలేదు