262
రామాయణ విశేషములు
ప్రాంతములో ఈరానులో యార్‌ఖండ్, కషఘర్, మండలాల నాక్ర మించుకొని యచట స్థిరపడిరి. ఆ సమయములోని చీనా చక్రవర్తి యఛీ జాతితో సంధిచేసుకొని హూణుల నెదిరించెను క్రీస్తు శకారంభమున యఛీలు హిందూస్థానములో ప్రవేశించి కాశ్మీరు, పంజాబుదేశాలలో నిలచి పోయిరి. వారు క్రమముగా గూర్జర ప్రాంతానికిని వ్యాపించిరి. వారిలోని వాడే కనిష్క చక్రవర్తియని చారిత్రికులు తేల్చినారు. గూర్జరమునుండి కొందరు క్రీస్తుశకాదినుండి పదవ శతాబ్దమువరకు తెనుగుదేశములోనికి వచ్చియుండిన ఆశ్చర్యము కాదు. కావున ఈ యఛీ జాతివారే యక్షులని యనుకొందును. మన ప్రాచీనశైవము కాశ్మీర శైవమనియు, ద్రావిడ శైవ మనియు రెండు విధాలుగా నుండెను. కాశ్మీరము తురకాణముగా మారు వరకు కాశ్మీరులు పరమవీరశైవులు. యచీ లచటనే శైవమును పుచ్చుకొన్నవారై యుందురు. అందుచేతనే జక్కులవారున్నూ శివశక్తుల పూజకులై యున్నారు.
యూరోపుఖండములోని బ్లాక్‌సీ (Black sea) అను సముద్రానికి ప్రాచీనకాలమందు యుక్షైన్ సముద్రమని (Euxine sea) పేరుండెను. యుక్షైన్ ప్రాంతమందుండిన జనులను యక్షులనిరేమో అనియు నొక యూహను తెలుపుకొంటున్నారు. అక్షస్ (Oxus) నదీప్రాంతము వారైనా అయియుందురు. అక్షస్ పదాన్ని బట్టి యక్షస్ యేర్పడియుండును. ఈ మూడింటి నేదైనా ఒకటి మూలమైయుండును.
ఇక కిన్నరు లెవరో తెలుసుకొందము. ప్రాచీన గ్రీకు చరిత్ర కారులు (Kanarii) ‘కనారియై' అను జాతియొక్కటి ఏషియా మైనరులో నుండినట్లు వ్రాసినారు. ఆ జాతి ఏషియా మైనరులో సిరియా మున్నగు దేశాలలో నుండిన ఒక శక (Sematic) జాతియై యుండును.
మన తెనుగు కిన్నర లేక కిన్నెర అనిన ఏకతంత్రీ సమాయుక్త మగు తంబురావంటి యొక వాద్య విశేషము. అయితే చిత్ర మేమన గ్రీకు