xxvii
కాని యీ మహారామాయణమునకు మూలమని చెప్పఁదగిన
సంక్షేప రామాయణముమాత్రము కథానాయకుని కాలమున కతి సన్ని
హితమైనదని నేను జాలకాలముగా నమ్ముచున్నాను. అది యిప్పటి
మహారామాయణమున కాదిమసర్గగా నందుఁ బ్రదర్శింపఁబడినది. కాని
యది యత్యంత పురాతనమయిన యొకానొక యార్షకావ్యముగా నేను
దలంచుచున్నాను.
“దృష్టార్థ కథన మాఖ్యానం" అని మన ప్రాచీన పురాణము
లందుఁ జెప్పఁబడిన యాఖ్యానలక్షణమున కది సర్వధా సరిపోవు
చున్నది. "శ్రుతార్థ కథన ముపాఖ్యానం" అను నుపాఖ్యాన లక్షణము
మహాభారతారణ్యపర్వమునఁ గానవచ్చు రామోపాఖ్యానమునకే యను
రూపముగ నున్నది. కనుక నా నిర్ణయము ప్రకారము -
“ఏతదాఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః
సపుత్ర పౌత్ర స్సగణః ప్రేత్య స్వర్గే మహీయతే.”
రా. సర్గ 1. శ్లో 99.
అను తదుపసంహార శ్లోక ప్రమాణమునుబట్టి రామచరిత్రాత్మకమైన ఆ
యాఖ్యానముమాత్రమే మనకుఁ జారిత్రక ప్రమాణమనుట న్యాయమైనది.
ఇట్టి యాఖ్యానమున నే వృత్తాంతము లేదో అది యనైతిహాసిక మనియు
నేది కలదో అది యైతిహాసిక మనియు నొక నిర్ణయమునకువచ్చి విమర్శ
కులు రామకథా నిర్ణయమునకుఁ బూనుకొనుట యుక్తతమము.
ఆఖ్యానములు వేదములవలె నా ప్తవాక్యములుగాఁ మన పూర్వులు నిర్ణయించియున్నారు. వాయుపురాణమున విద్యాస్థానమునందు "ఆఖ్యాన పంచమాన్ వేదాన్" అను వర్ణన మనేక ఘట్టములలోఁ గలదు. ఇందు వలన నీ యాఖ్యానములు వేదములతోపాటు పఠింపఁబడవలసినవిగాఁ గూడఁ బెద్దల నిర్ణయము. ప్రసిద్ధములైన రామాయణ మహాభారత హరి