పుట:రామాయణ విశేషములు.pdf/249

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 189 బాణమువలె మహావేగముతో ప్రవహించును. అందుచేత ఆ భాషలో టైగ్రిస్ అనగా బాణము. మన పూర్వికులు శరావతి అను ఒక నదిని పేర్కొనిరి. అది యీ టైగ్రిస్ నదియేయైయుండును. యూఫ్రటీస్ అనెడు నది "యూ - భరతస్" అనున దనియు, భరతుని పేర దానికా పేరు మనవారు పెట్టియుండిరనియు ఒక చరిత్రకారుడు వ్రాసినాడు. ఆక్సస్ నదిని ఇతునది అనినట్లున్నది. రెడ్సీ అను ఇంగ్లీషు పదమునే మన పూర్వికులు లోహిత సముద్రము అని రామాయణములో వాడినారు. ఆ సముద్రములోని ఎర్రని ఛాయవలన ఈ పేరు వచ్చుటచే మనవారి వలెనే ఇంగ్లీషువారును దానికి “రెడ్సి" (ఎఱ్ఱ సముద్రము) అని పేరు పెట్టి యుందురు. ఇదేవిధముగా యక్ష, రాక్షస, కిన్నర, నాగ, వాన రాది జాతులు మనుష్యులు కానట్టి భూతములు, జంతువులు అని పౌరాణికులు పొరపాటుపడిరి. ఆదిపౌరాణికులు కాభ్రమ లేకుండెను. తర్వాత పురాణాలను పెంచినవారికి ఆదికాలపు వారికుండు భౌగోళిక జ్ఞానము లేనందున వారిట్టి పొరపాటులు చేసినవారైరి. యక్షాది జాతుల వారందరునూ మనుష్యులే. వీరందరునూ ఆనార్యులైయుండిరి. ఈ చర్చ “వానర రాక్షసత త్వము” అను ముందు ప్రకరణములో చేయుదును. ఇక మన రామాయణములో వాల్మీకికి తెలిసియుండిన ప్రపంచ భూగోళ మెట్టిదో విచారింతము. రామాయణములో నాలుగు బావులలో సందర్భానుసారముగా భూగోళ పరిస్థితులు కొన్ని తెలుపబడినవి. 1. శ్రీరాముడు విశ్వామిత్రునితో ఆశ్రమమునుండి జనకరాజు రాజధానివరకు ప్రయాణము చేయుట. 2. భరతుడు తన తాత నగరములోనుండగా అతనిని పిలుచుకొని వచ్చుటకు వెళ్ళినవారి మార్గము, మరియు భరతుడు తన తాతయింట నుండి అయోధ్యకు వచ్చినమార్గము.