198 రామాయణ విశేషములు నప్పుడు వారు ఊర్ధ్వలోకాలలోనో ఆధోలోకాలలోనో యుండినవారని తలపరాదు. వారు భూలోకములోనివారనియే గమనించియుండవలెను. మరియు పైవారేకాక శక, పహ్లవ, హూణ, బర్బరాది జాతులను గురించి చదివినప్పుడు వారు హిందూస్థానములోనే యుండినారని తలపరాదు. వారికై ఏషియా ఖండమందును, తూర్పు దీవులందును, ఆఫ్రికాలోని ఈజిప్టునందును, అబిసీనియాయందును, గ్రీకు దేశమందును వెదకవలెను. అనగా మన ప్రాచీనుల భూగోళ జ్ఞానము ఏషియాఖండమంతయును, ఆఫ్రికాలో ఈజిప్టు, అబిసీనియా దేశాలును, యూరోపులో గ్రీసు దేశ మును మాత్రమే. అంతకుమించి వారికి తెలియదనవచ్చును. పాతాళ లోకము అమెరికా అనియు, మయ అను మెక్సికో జాతివారు మయసభ నిర్మాతలగు మయ జాతివారేయనియు ఒక వాదమున్నది. అదింకను స్థిరపడలేదు. ఈ దృష్టితో పురాణాలను చదువుటవలన మనము చాలా చిక్కు లను విడదీయగలమని తలతును. ఈ దృష్టితోనే నేనీ చర్చను చేయు చున్నాను. మన పురాణాలన్నింటిలో కొన్ని సామాన్యధర్మములు కానవచ్చు చున్నవి. అన్ని పురాణాలలోను వంశావళులు, నీతులు, ధర్మములు, సృష్టిక్రమమును వర్ణించియున్నారు. ఈ సృష్టిక్రమములోనే భూగోళ పరిజ్ఞానము చేరియున్నది. ప్రాచీన ప్రాచీన కాలములో ఈ పురాణక ర్తలు తమకు తెలిసిన దేశాలను వర్ణించుటయేకాక తాము ఇతరులవలన విన్న సంగతులను గూడ చేర్చినారు. దధిక్షీరాది సప్తవిధ సముద్రా లుండినట్లు, చిత్రవిచిత్రజాతులు, అనగా యక్షరాక్షసగంధర్వాదు లుండి నట్లును వ్రాసినారు. ఇందు చాలావరకు సత్యమే యిమిడియున్నది. ఇప్పటి కాలమందును ఒక్కొక్క దేశానికి అనేక నామములున్నవి. ఆ కాలమందును విదేశములకు మన పూర్వికులు తమకు తోచిన పేరులను పెట్టి వ్యవహరించిరి టైగ్రిస్ అనెడు నది ఖాల్దియాలోనిది. అది
పుట:రామాయణ విశేషములు.pdf/248
ఈ పుటను అచ్చుదిద్దలేదు