పుట:రామాయణ విశేషములు.pdf/244

ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 రామాయణ విశేషములు చిత్రింపబడిన భాగము దశరథుని ఉత్తమగుణములు చాలా సుందరముగా ఇందు వర్ణింపబడినవి. వసిష్ఠు డు ఇతని ప్రతిభను గురించి చాలా వినుచుందుము. విశ్వామిత్రుని తన కామధేనువు యొక్క దివ్యశ క్తిచే పరిపరి విధముల పరిభవించి ఓడించిన వాడట! అట్టి వసిష్ఠుడు రామాయణములో పనికిరాని ఒక పంచాంగ పురోహితునివలె కనబడుచున్నాడు. దశరథునికి కలిగిన చిక్కును తీర్చడు. కైకేయిని గర్హింపడు దశరథుడు చనిపోయిన తర్వాత నలుగురు పెద్దమనుష్యులలో తానును ఒకనివలె కనిపించును కాని అతని ప్రాధాన్యము కానరాదు. భరతునివెంట నలుగురితోపాటు వెళ్లును. ఇది సరి, ఇది తప్పు అని యేమియు నిర్ణయింపడు. భరద్వాజుని ఆశ్రమములో ఇతని ఖ్యాతికి తగిన మన్నన కానరాదు. భరతుడు పాదుకలతో వెళ్ళి పోయినప్పటినుండి మరల రామాయణములో వసిష్ఠుడు కానరాడు. విశ్వామిత్రుడు రావు. వసిష్ఠునివలెనే రామాయణములో పనికిరానివానివలే కానవచ్చును. అతని గొప్పతనాన్ని బాలరామ లక్ష్మణులకు ఇతర మునులెవ్వరో చెప్పుదురు. కాని ఆ గొప్పతనానికి తగిన చర్యలు రామాయణములో కాన రామునికి బాణవిద్యను నేర్పువాడతని సహాయమునే పొందును. కొంత కాలములోనే శ్రీరాముని మిథిలకు పిలుచుకొనిపోవును. అక్కడ సీతను రాముని కిచ్చునట్లు ఏర్పాటుచేయును. అంతటితో అతనిపని ముగిసినది. ఇక రామాయణములో ఎచ్చటను కానరాడు. ఏమైపోయినట్లు? విశ్వామిత్ర వసిష్ఠులను గురించి ఒక అంశమును గమనింప వలెను. పురాణకర్తలు, వీరు ఓకేవ్యక్తి అనుకొని పొరపాటుపడినారు. వసిష్ఠవంశములో పలువురా పేరుతో వెలసిరి. అదేవిధముగా విశ్వామిత్ర