రామాయణ విశేషములు 193 రావణుడు బంధుప్రీతి కలవాడు. తన తమ్ముడు చనిపోయి నప్పుడు చాలా వ్యసనపడెను. ఇంద్రజిత్తు చనిపోయినప్పుడు అతని దుర్భర దుఃఖమును వాల్మీకి బాగా వర్ణించినాడు. రావణుడు కన్నీరు జొటజొట కార్చెను. అవి కాలుచున్న నూనెబొట్లవలె నుండెను. అతనికి క్రోధముకూడా నిండియుండెను. అందరును స్తబ్ధులైరి. ఎవరికిని అతనితో మాట్లాడే ధై ర్యములేకుండెను. అతని పట్టపురాణి మండోదరి. అప్పుడప్పు డామెను సలహా అడుగుచుండెను. తుదికాలములో కూడా అడిగెను. ఆమె చక్కని నీతియుక్తమగు బోధకావించెను. కాని అతని పాపము పండినందున దానిని విను బుద్ధి అతనికి పుట్టలేదు. వి. షణుడు దేశద్రోహి, బంధుద్రోహి అని రాక్షసులచేత గర్హింపబడినాడు. తన యన్న నీతిబాహ్యుడైనందున రాముని ఆశ్రయింపవలసి వచ్చెను. అతడు రాక్షసులలో తప్ప బుట్టినాడు. శాంతపురుషుడు. ధార్మికుడు. నీతిజ్ఞుడు. రామునికి గొప్ప సహాయము చేసినవాడు. అందుచేత కీర్త నీయుడై నాడు. దశరథుడు బహుకాలము బహుభార్యలతో భోగాలనుభవించెను. ముసలి ముప్పునకు కైకేయిని పెండ్లాడెను. లేక లేక నల్గురు కుమారులు కల్గిరి. అందు రామునిపై పంచప్రాణా లప్పజెప్పుచుండెను. తాను చూచు చుండగనే అతనిని రాజుగా చేసి ఆ వైభవమును చూడగోరెను. కై కేయి భగ్నపరచెను. అతడు కరుణామయమూర్తి. సత్యవాక్యపరిపాలకుడు. లోకానుభవము సంపూర్ణముగా కలిగినవాడు. కైకేయిని పరిపరివిధములు ప్రార్థించిన ఘట్టము ప్రపంచవాఙ్మయమున సాటిలేనట్టిది. శ్రోతలు కంట తడిబెట్టక మానరు. అయోధ్యాకాండమంతయు మహాపరితాపముతో RV-13
పుట:రామాయణ విశేషములు.pdf/243
ఈ పుటను అచ్చుదిద్దలేదు