పుట:రామాయణ విశేషములు.pdf/242

ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 హనుమంతుడు రామాయణ విశేషములు ఒకటి చెప్పితే రెండు చేసుకొనివచ్చు రాముని నమ్మిన బంటు. మహాసమర్థుడు. కాని నిగర్వి, మహాప్రజ్ఞా ధురీణుడు. కాని వినయ సంపన్నుడు. సంస్కృతములో మహా పండితుడు బహుభాషల నెరిగిన వాడు. విశ్వాసపాత్రుడు. రావణుడు మహాబలాఢ్యుడు. అనేక దేశాలను జయించినవాడు. శత్రు భయంకరుడు. విషయాసక్తుడు. విషయాసక్తుడు. 1000 మంది భార్యలు కలవాడు. సీతను కామించి ప్రపంచమందు శాశ్వతమగు అపకీర్తిని పొందినవాడు. ఈ సందర్భములో రావణునికి దుర్యోధనునికిని కల తారతమ్య మెరుగ వలెను. రావణుని చెల్లెలగు శూర్పణఖయొక్క ముక్కు చెవులు కోయించిన వాడు రాముడు. ఖరదూషణాదుల 14000 మందిని సంహరించినది రాముడు. దానికి ప్రతీకారము చేయదలచినది రావణుడు. రాముడు ఆర్యుడు. రావణుడు రాక్షసుడు. ఇద్దరును సంపూర్ణముగా భిన్నజాతు లకు చేరినవారు. దుర్యోధనుడును ధర్మరాజును అన్నదమ్ముల కుమారులు. జ్ఞాతులు. ద్రౌపది దుర్యోధనునికి వదినెవరుస. ఆమెను జూదములో దుర్యోధనుడు గెలిచినాడు. ఆమెను తన తమ్మునిచే సభకు సిగబట్టి లాగించినాడు. నిండుసభలో ఆమెను దిగంబరనుగా చేయించి నాడు. నా తొడపై కూర్చుండరమ్ము అని ద్రౌపదిని పిలిచినాడు. రావణుడు ఒల్లని సీతను బలాత్కార కామమునకు గురిచేయలేదు. రాక్షస వివాహాలలో ఒల్లని స్త్రీలకు ఒక సంవత్సరము గడువిచ్చుచుండిరి. సీతకు అదే గడువిచ్చినాడు. రావణుని జాతి నరమాంసమును తినునట్టిదని వర్ణింపబడెను. తన బలమంతయు, తన కుమారులు, బంధువులు, తమ్ములు నాశనమైనప్పుడు కూడా సీతను చంపలేదు. అయినను ఆర్యులలో బలాత్కామమును గర్హించినట్లు మరి దేనిని గూడా గర్జింపకుండిరి. దుర్యోధనునికిని, రావణునికిని ప్రాయశ్చిత్తము తప్పదయ్యెను.