రామాయణ విశేషములు 191 సకల భూలోక వైభవములు, ఆమెకు రాముని పాదధూళితో సమానము. ఘోరహింసలు ఆమెను ఆవంతయు చలింపజేయలేదు. జగద్విద్రావణు డగు రావణుడు ఆమెకు గడ్డిపుల్లతో సాటి. అతనితో మాట్లాడినప్పుడు గరికపుల్ల నడ్డముగా పెట్టి మాట్లాడినది. "నీ విలువయంతే" అని చెప్ప కయే చెప్పినది. హనుమంతుడామెను తన వీపుపై ఎక్కించుకొని తీసు కొని పోదుననెను. ఆమె నీతిజ్ఞ. అట్లు చేసిన తన కపవాదము, పర పురుషునిస్పర్శ, రాముని శార్యమునకు భంగము, రావణునికి శిక్ష తప్పుట, ఇవన్నియు సంభవించునని నిరాకరించెను. ఆమె ధైర్యము, కష్టములనోర్చు సహనము చాలా ప్రశంసనీయ ములు. అడవికి పోవుటకై సిద్ధమైననాడు ఆమెకు తాపసు లెట్టివారో తెలి యదు. అందుచేత కైకేయి ఆమె చేతికి నారచీర లియ్యగా కంట నీరు పెట్టుకొని, రామా ! "కథన్ను బధ్నంతి మునయో వనవాసినః ఇతి హ్యకుశలా సీతా సా ముమోహ ముహు ర్మహుః అయో. 37-12 వనవాసినులు నారచీరలెట్లు కట్టుకొంటారు? అని సభలో అందరి యెదుట అడిగెను. ఆమె యమాయకత్వాని కందరును విలపించిరి. రాముడామెకు సభలోనే చీరపై చీరకట్టు విధమును తనకు వచ్చినట్టుగా చూపించెను సీత రామునికి సేవకురాలుగానే యుండలేదు. అవసరమని తోచినప్పుడు మంత్రివలె తనకు తోచిన అభిప్రాయముల నిచ్చుచుండెను. ఋషులు రాముని రాక్షసులను సంహరించుటకు ప్రేరేపించినప్పుడు చక్కని హితమును చెప్పి తుద కిట్లనెను: “రామా! శ్రీ చాపలముచే నేనిట్లు చెప్పితిని నీకు ధర్మోపదేశము చేయ సమర్థుడెవడు? నీ తమ్మునితోగూడా ఆలోచించి మీ కేది యుచితమని తోచునో దాని నాచరిఁచుడు.” " నీ
పుట:రామాయణ విశేషములు.pdf/241
ఈ పుటను అచ్చుదిద్దలేదు