పుట:రామాయణ విశేషములు.pdf/238

ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 రామాయణ విశేషములు పరాక్రమశాలురకు దైవము అడ్డము రాజాలదు అని గట్టిగా పలికినాడు. భరతుడు తల్లివంటి గుణాలుకలవాడై యుండునని మొదలను కొన్నాడు. దూరమందు భరతుడు అరణ్యానికి వచ్చుట చూచినాడు, అతడు దురుద్దేశముతో వచ్చినాడు. ఇదిగో ఇప్పుడే అతని పని పట్టించు తాను చూడు అని అన్నతో పలికినాడు. భరతుడు చాలా మంచివాడే అని తేలిన తర్వాత అట్టి తల్లి కిట్టి కొడుకు పుట్టినాడే అని ఆశ్చర్య పడినాడు. రామునుదే కాక సీతయందును లక్ష్మణునికి పరమభక్తి. సీతా రాములకు ఏమాత్రమున్నూ ఆయాసము, శ్రమ, కష్టము కలుగకుండా సేవించిన బంటు రాత్రులందు వారికి పహరాయిచ్చి కావలికాచినాడు. వారి ఆజ్ఞలను పాలించినాడు. కాని తన ధర్మాగ్రహమును ప్రకటించక మానలేదు. సీత కిష్కింధలో పారవేసిన ఆభరణాలను లక్ష్మణునికి చూపించినారు. అందేదియు అతడు గు రించ జాలినవాడుకాడు. ఒక్క నూపురమును మాత్రము వెంటనేగుర్తించినాడు. “నాహు జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్." (కి. 9-22) ఇది సుందరమైన భావము. అతని అకల్మషత్వమును వెల్ల డించును. సీతను తల్లికంటె ఎక్కువగా పూజించినదిఁదు ధ్వనింప బడినది. ఆయితే గంగను దాటేకాలములో రామునాజ్ఞచేత లక్ష్మణుడు సీతను చేతులతో ఎత్తి పడవలోని కెక్కించెను. ఆవిధముగా ఆమెను లాకుటలో ఆ నిష్కలంకునికి దోషములేదు. సూపురములను మాత్రమే గుర్తింతును అనుటలో అతడు సీతను పరికించి యెన్నడును చూడ లేదని భావము. ఆమె తన దృష్టిలో అంత పవిత్ర.