పుట:రామాయణ విశేషములు.pdf/236

ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 రామాయణ విశేషములు అతని రాముడు వాలిని చంపుట తప్పని వాలితో నొప్పుకొన్నట్లును, నన్యాయముగా జంపినందులకు ప్రాయశ్చిత్తముగా సీతావియోగమును మరొకమారు పొందుననియు చెప్పినట్లును కవి నిరూపించినాడు. (ఉత్తర కాండలోని సీతావియోగ సూచన యీ రెండవ వియోగము), రామునికి సీత అంటే రెండవప్రాణము. కాని ఆయన లక్ష్మణుని ఎంతగాఢముగా ప్రేమించెనో ఆ ముచ్చట తుదివరకునూ వ్యక్తపరుప లేదు యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్ఛనొందినప్పుడు రాముడు నాకు రాజ్యమేల, సీతయేల ? నా కెవ్వరునూ లక్ష్మణుడు లేనిది కాబట్టరు అని విలపించెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపి వచ్చినప్పుడు అతనిని గాఢముగా కౌగలించుకొని చిన్న పిల్లవానిని వలె తన తొడపై కూర్చుండ బెట్టుకొని లాలించెను. రావణుడు తనకు చేసినంత యపకారము మరెవ్వరును చేయ లేదుకదా! మొదటిసారి ఇరువురును పోరాడినప్పుడు రావణుని రథమును ధనుస్సును ఆయుధాలను అన్నింటిని రాముడు ధ్వంసము చేసెను. అప్పు డీతనిని చంపి యుండవచ్చును కదా! చంపలేదు. “నీవు నిరా యుధుడవు; నీ నగరములోనికి వెళ్ళి మరల క్రొత్తరథమెక్కి ఆయుధా లతో రమ్ము" అని పంపివేసెను. రావణుడు చనిపోయిన వెంటనే రాము డిట్లనెను. మరణాంతాని వైరాణి నివృత్తు నః ప్రయోజనం యుద్ధ. 112_28 ఇతని చావుతో నా వైరముకూడా ముగిసినది. ఇతని యుత్తర రులను లోపము లేకుండా చేయవలెను అని ఆజ్ఞాపించెను రామునికి సీతయొక్క పాతివ్రత్యము, ఆమె లోకోత్తర పవి యును తెలియును. కాని రావణునియింట ఒక ఏడు ఉండిన