184 రామాయణ విశేషములు జనులతనిపై ఏ వ్యసనచిహ్నములు కూడా చూడజాలక పోయిరి. పైగా అతడు ప్రసన్నుడుగా కాంతియుక్తుడుగా నుండెను. అయితే రామునిలో అంతయు నిగ్రహమే కాని కష్టకాలమందు వ్యసనపడు మానవ సహజ గుణమే లేదా అనిన అదియును కలదు. అతడెవ్వరి యెదుట నిగ్రహము, ప్రసన్నత, గాంభీర్యము చూపింపవలెనో బాగా ఎరుగును. తనతల్లి వద్దకూడా అట్లే చాలాసేపు ఆచరించుకొనెను. కాని ఎంతసేపు? ఆమె దుఃఖపరంపరలకు లోబడి- "తాం తథా రుదతీం రామో రుదన్ వచన మబ్రవీత్. (అయో. 42-20) తల్లి దుఃఖాన్ని చూచి తుదకు పట్టలేక రోదనము చేసెను. ఇదే వ్యసనముతో అతడు సీతను చూడబోయెను. ఆ యమాయకురాలి కిఁకను తారుమారైన యీ వ్యవస్థ తెలియనే తెలియదు. ఆమె చింతావ్యాకులుడైన రాముని చూచి భయపడెను. మరి రాముడున్నూ ఆమెను చూచిన వెంటనే దుఃఖము నాపుకొనలేక రోదనము చేసెను ఇది తన ఆంతరంగికుల యెదుట. మరల సీతాలక్ష్మణులతో తుదిమారు తండ్రి సెలవు తీసుకొను నప్పుడు నిగ్రహమును, ప్రశాంతతను, గాంభీర్యమును ప్రకటించెను. ప్రజ లందరు ఏడ్చిరి కాని ఆతడేమియు సంచలించలేదు. లక్ష్మణు డేడ్చెను. రౌద్రమూర్తియయ్యెను. కాని రాముడతని నోదార్చి, శాంతు నిగా జేసెను. అరణ్యా వాసమందును ఎన్నడును తండ్రిని కినియలేదు. మహా వ్యసనము ముంచుకొనివచ్చిననాడు మాత్రమే రెండుమూడు మారులు ఇక కైకేయి సంతోషపడుగాక అని జారవిడిచెను. భరతుడు తనను అడవిలో కలిసెను. అప్పుడతనితో తనతల్లి నేమాత్రముస్నూ కష్ట పెట్టవద్దని ఆజ్ఞాపించెను. ఇంకొక రైయుండిన ప్రజలు, పురోహితులు, మంత్రులు, భరతశత్రుఘ్నులు, కైకేయీదేవితో కూడవచ్చి రాజ్యము చేయుటకై మరలిరమ్మని ప్రార్థించియుండిన ఒప్పుకొని యుందురు. రాముడట్లు చేయలేదు.
పుట:రామాయణ విశేషములు.pdf/234
ఈ పుటను అచ్చుదిద్దలేదు