పుట:రామాయణ విశేషములు.pdf/232

ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 గుణపోషణము రామాయణ విశేషములు ఇంతవరకు కవితా విశేషములను గురించి యథామతి సంక్షిప్త ముగా తెలుపబడినది. రామాయణము కవితయందెంతటి ప్రాముఖ్యము వహించినదో అందలి పాత్రల గుణపోషణమందును అంతటి ప్రాముఖ్యము వహించినది. రామాయణమందలి ప్రతివ్యక్తికిని ఒక ప్రత్యేకత కలదు. వ్య క్తిత్వము అంతటను ఏక విధముగా నిరూపింపబడినది ఆంగ్ల దేశ మందు 400 ఏండ్ల క్రిందట జగత్ప్రసిద్ధిగాంచిన షేక్స్పియర్ మహాకవి తన నాటకములలో ఎంతటి చిన్న పాత్రయైనను సరే దానికొక విశిష్టగుణ పోషణమును (Characterisation) చేయుటలో అద్వితీయుడని పేరు పొందినాడు. రామాయణమందును అదే లక్షణము సమగ్రముగా కనబడు చున్నది. వాల్మీకి షేక్స్పియరులలో భేద మేమనిన ఒకడు ఇంచుమించు 4000 ఏండ్ల క్రిందటివాడు. ఇంకొకడు 400 ఏండ్ల క్రిందటివాడు ! ఇంతే ! ! రామాయణమందలి పాత్రలన్నిఁటి గుణపోషణమును గురించి చర్చించినచో విషయవిస్తర మగును. కావున వాల్మీకి చిత్రించిన కొందరిని గురించిమాత్రమే, అదియును సంగ్రహముగానే, యిందు సూచింపబడుచున్నది శ్రీరాముడు ఇతడు కథానాయకుడు. ప్రధానపాత్ర. ప్రపంచ మహానాయకు లలో అగ్రగణ్యుడు. ఏమాత్రము కూడ కళంకములేని అవతారపురుషు డని హిందువుల విశ్వాసము. అందుచేతనే దేవుడై వెలసినాడు. ఇచ్చట అతనిని మానవో తమునిగానే గ్రహించి విచారింతును. యౌవరాజ్య పట్టాభిషేక కాలములో రాముని ఉతమో తమ గుణములు 1 వ్యక్త