పుట:రామాయణ విశేషములు.pdf/231

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 181 ఋక్షేణ గీత శ్లోకో మే తన్ని బోధ ప్లవంగమ. యుద్ధ, 116-42 ఇది సుప్రసిద్ధమైన “ససేమిరా” భల్లూకము కథ. దీనిని రామాయణమందు పెంచకుండా ఒకే శ్లోకములో సూచించి వదలినారు. అదేవిధముగా అష్టావక్రుని కథను ఒకే శ్లోకములో సూచించి వదలినారు. నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః చలోర్మిమాలి తుదృష్ట్వా సముద్రోపి నకంపతే. బాల. 15-10 రావణునిపై సూర్యుడు ఎండగాయడు, గాలి వీచుటకు భయ పడును, సముద్రుడు చలింపడు అను భావమును పోతన హిరణ్య కశిపునిచే నిట్లు చెప్పించినాడు అస్మదీయంబగు నాదేశమునగాని మిక్కిలి రవిమింట మెరయ వెరచు అన్ని కాలములందు ననుకూలుడై కాని, విద్వేషియై గాలి వీవవెరచు మత్ప్రతాపానలమందీర్ఘృతార్చియై విచ్చలవిడి నగ్ని వెలుగు వెరచు అతిశాతయైన నా యాజ్ఞ నుల్లంఘించి శమనుండు ప్రాణులజంప ఇంద్రుడౌదల నా మ్రోల నెత్త వెఱచు అమరకిన్నర గంధర్వయక్ష విహగ నాగవిద్యాధరావలి నాకు వెరచు ఏల వెరవవు పలువ నీకేది దిక్కు? వెరచు భాగవతము సప్తమస్కందము 257 యుద్ధ. 122–17 అష్టావక్రేణ ధర్మాత్మా లారీతో బ్రాహ్మణో యథా. సంస్కృత సాహిత్యమందు మంచి ప్రవేశముగల వారి కిట్టి మింకెన్నియో కనబడక మానవు.