178 రామాయణ విశేషములు నవసంగమసంవ్రీడలగు స్త్రీల జఘనములవలె శరత్కాలమందు నీరింకుటచేత నదులు పులినములను ప్రదర్శించుచున్నవి. (కి. 80-28) తర్వాతికాలపు కవులందరును రామాయణములోని ఋతువర్ణన లతో తులదూగు వర్ణనలు రచింపజాలిన వారుకారు. ఋతు సంహారమును రచించిన కవి (కాళిదాసైనను సరే, మరెవ్వరైనను సరే) రామాయణము నుండియే భావములను, తుదకు శైలినిగూడా అనుకరించెను. వాల్మీకికి ఉపమానాలు చాలా యిష్టము. తర్వాతి కాలములో కాళిదాసు ఈ పద్ధతిని బాగా అనుకరించెను. రామాయణమఁ దేవర్ణన నైనను చదివినచో ఉపమానములందు కనబడును. కావున ప్రత్యేకముగా వాటి నుదాహరించుట అనవసరము. రామాయణ కవితను తర్వాతి కవులు చాలామంది విశేషముగా అనుకరించుచు వచ్చిరి. కొందరు కవులు అందలి భావములను స్పష్ట ముగా గ్రహించిరి. మహాభారతమందు కొన్ని రామాయణ శ్లోకాలు కనబడుచున్నవి. మరికొన్ని భావాల అనుకరణముకూడా కనబడు చున్నది. ఎట్లనగా...... “అనార్యజుష్ట మస్వర్గ్యం కుర్యాం పాప మహం యది” (అయో. 82–14) “అనార్యజుష్ట మస్వర్గ్యం మకీర్తికర మర్జున" భగవద్గీత. 66 "యద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ప్రతిగృహ్లియాం భక్షా న్విషకృతానివ." 99 (అయో. 07-4) "కులక్షయకృతం దోషం మిత్రద్రో హేచ పాతకం" భగవద్గీత. “నహిచ్చేయ మధర్మేణ శక్రత్వ మపి లక్ష్మణ" ఆయో. 97_7
పుట:రామాయణ విశేషములు.pdf/228
ఈ పుటను అచ్చుదిద్దలేదు