రామాయణ విశేషములు 175 బయలుదేరి కొన్ని కవితా నిబంధనలను ఏర్పాటు చేసినారు. ఆ కొలత బద్దతో నేను వాల్మీకిని కొలుచుటకు పూనుకొనను. సూటిగా నాకెట్లు నా భావ స్ఫురణము కలిగినదో దానిని మాత్రమే నివేదించుకొందును. కవితా ప్రయోజనము ఆనందము, లేక విజ్ఞాన ప్రదానము, లేక బోధ రామాయణములో ఈ మూడున్నూ సంపూర్ణముగా కలవు. "ఏకో రసః కరుణ ఏవ” అని కొందరు ఆలంకారికులు తెలిపియున్నారు. రామాయణమం దీ రసము సమగ్రముగా ఉన్నది. ఒక విధముగా రామాయణము కరుణ రస పూరిత కావ్యము. దశరథునికి సంతానము లేదను చింత, కలిగిన కొన్ని యేండ్లకే పుత్రుల వియోగము. తర్వాత సీతారామలక్ష్మణుల అరణ్యావాసము, దశరథుని మరణము, భరతుని సంతాపము, అరణ్యమందు రామాదుల కష్టములు, శూర్పణఖా పరాభవము, కబంధుని మరణము, శరభంగుని మృతి, ఖరాదుల వధ, సీతాపహరణము, రాముని పరితాపము, జటాయువు యొక్క ఆత్మార్మ ణము, వాలి వధ, లంకాదహనము, రాక్షసుల వినాశము, లక్ష్మణుని మూర్ఛ, రాముని వ్యసనము, సీతాపరీక్ష, ఈ విధముగా అడుగడు గునకునూ శోకమే పాఠకుల నెదుర్కొనుచున్నది. సాంప్రదాయక ముగా రామాయణమందు సుందరకాండ శ్రేష్ఠమైన దందురు. నాకు అయోధ్యా కాండయే శ్రేష్ఠతమ మైనది. ఏ భాగము చదువుకున్నను ఒక్క అయోధ్యాకాండను మాత్రము చదివితే అనేకోత్తమ కావ్యాలు చదివినట్లు అని భావింతును. రామాయణములో కథ యొక్క యైక్యత కలదు. ఇతర పురాణా లలో ఆది కానరాదు. మహాభారతములో ఉపాఖ్యానాలు కొల్లలుగా ఉన్నవి. మూలకథకు సంబంధము లేని శాంత్యానుశాసనికాది పర్వాలు బహు దీర్ఘమైనవి కలవు. రామాయణ మందును కొన్ని యుపాఖ్యానాలు కలవు. ఋశ్యశృంగోపాఖ్యానము, కుశనాభకోపాఖ్యానము, భగీరథో تو
పుట:రామాయణ విశేషములు.pdf/225
ఈ పుటను అచ్చుదిద్దలేదు