రామాయణ విశేషములు "ధర్మా దర్జః ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం 171 ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్." (ఆర. 9-30) “పరేతకల్పాహి గతాయుషో నరా హితం న గృష్ణాంతి సుహృద్భి రీరితం.” (ఆర. 41-21) స్నేహితుల హితమును గ్రహించనివారు చెడినవారు. ప్రేత సమానులు. “ఉత్సాహవంతోహి నరా న లోకే, సీదంతి కర్మ స్వతిదుష్క రేషు.” (ఆర. 68-19) ఉత్సాహవంతులైనవారు అతిదుష్కరమగు కార్యములందు కూడా పరాజయము పొందరు. "ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు." (ఉత్సాహ వర్ణనమును గురించి కిష్కి. 1-122 నుండి 125 వరకు చూడుడు.) "శోచతో వ్యవసీదంతి సర్వార్థా” (822 27-84) వ్యసనమందు లగ్నుడగు వానికి ఆనర్థములు కలుగును. “నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పాన మేవం ప్రశస్యతే ఇది పానా దరశ్చ ధర్మశ్చ కామళ్చ పరిహీయతే" (కిష్కి. 38-48) మద్యపానమువలన ధర్మార్థకామములు నాశనమగును. మితపాన సంఘ (Temperance) ప్రచారానికి పనికివచ్చు నీతి. "మనోహి హేతు స్పర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే” (సుంద. 11-41) మనస్సే సర్వేంద్రియ ప్రవర్తనకు హేతువు. ఇది "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అను ఉపనిషద్వాక్యమును బోలియున్నది. “ఆకామాం కామయానస్య శరీర ముపతప్యతే" (సుంద. 22-42) కోపము ఉండకూడదు. దానివలన నష్టములను గురించి సుందర కాండ 55 సర్గలో 4, 5, 6, 7 శ్లోకాలలో బాగా ఉపన్యసించినారు. భృత్య లక్షణములను గురించి యుద్ధకాండ 1వ సర్గలో 7, 8, 9, 10 శ్లోకాలలో బాగా నిరూపించినారు.
పుట:రామాయణ విశేషములు.pdf/221
ఈ పుటను అచ్చుదిద్దలేదు